డీపీఎస్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ ర్యాలీ
రామవరప్పాడు : నిడమానూరు ఢిల్లీపబ్లిక్స్కూల్ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ నుంచి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు మీదుగా ‘ఎకో ఫ్రెండ్లీ దీపావళి’ అంశంపై సైకిల్ ర్యాలీ శనివారం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో బాణసంచా కాల్చకుండా దీపావళి జరుపుకోవాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీను ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ కాంతి రాణా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సాధ్యమయినంత వరకూ పర్యవరణానికి కీడు తలపెట్టె టపాకాయలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రవణ్ కుమార్, పాఠశాల ప్రోవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డీన్ ఎస్బీ రావు, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ బోరా పాల్గొన్నారు.