కన్నడ నటి మైత్రేయిగౌడకు జైలు
ఆ వెంటనే బెయిల్ ..
బెంగళూరు(బనశంకరి): ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో కన్నడ నటి మైత్రేయిగౌడకు రెండేళ్లు, ఆమె స్నేహితులు ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ నగర మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఆ వెంటనే బెంగళూరు ఐదో ఏసీఎంఎం కోర్టు ఈ నలుగురికీ బెయిల్ మంజూరైంది. 2011లో నటి మైత్రేయిగౌడ స్నేహితురాళ్లు సుప్రియ, రూపా, రేఖతో కలిసి నగరంలో ఓ వైపు కారు డ్రైవింగ్ చేస్తూ మరో వైపు సెల్ఫోన్లో మాట్లాడుతోంది. బసవేశ్వర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ శివకుమార్ కారును అడ్డుకోగా మైత్రేయిగౌడ ఆమె స్నేహితులు దాడికి పాల్పడ్డారు.
ఘటనపై బసవేశ్వరనగర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు శుక్రవారం బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు రాగా వీరి నలుగురి నేరం రుజువు కాడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అయితే ఆ వెంటనే నగర 5 వ ఏసీఎంఎం కోర్డు నలుగురికి బెయిల్ మంజూరు చేసింది.