ఏజెన్సీలో ప్రాణాలు పోతుంటే రాజకీయ దండయాత్రలా?
సీఎం చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ద్వజం
కొత్తపేట :
ఒక ప్రక్క ఏజెన్సీ ప్రాంతంలో వి విధ వ్యాధులతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోమలపై దండయాత్ర పేరుతో రాజకీయ దండయాత్రలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం రాత్రి జగ్గిరెడ్డి మండల పరిధిలోని గంటి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి ఏజెన్సీ వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. కాళ్లవాపు, మలేరియా తదితర వ్యాధులతో జనం చనిపోతుంటే సీఎంకు పట్టకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి సస్పెండ్ చేయాలనే దానిపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని మండిపడ్డారు.ప్రజలు ప్రాణాంతక వ్యాదులకు గురైనా,ప్రాణాలు కోల్పోతున్నా సీఎంగా మన్యంలో పర్యటించకపోవడం గమనిస్తే కేవలం వారి పార్టీకి ఆ ప్రాంతంలో సీట్లు రాలేదన్న కారణంతోనే అటువైపు వెళ్లడం లేదని విమర్శించారు.