trains resumed
-
రద్దయిన రైళ్ల పునరుద్ధరణ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–విశాఖపట్నం సెక్షన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలికంగా రద్దు చేసిన విశాఖపట్నం–విజయవాడ (02717/02718), విశాఖపట్నం–గుంటూరు (07240/07239), విశాఖప్నటం–లింగంపల్లి (02831/02832), విశాఖపట్నం–కడప (07488/07487) రైళ్లను యథావిధిగా నడపనున్నట్టు తెలిపారు. -
నడుస్తున్న రైళ్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూలు
ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి క్రమంగా వస్తోంది. బయ్యారం - ఎలమంచిలి మధ్య రైల్వే బ్రిడ్జిని పునరుద్ధరించారు. రెండు ట్రాకులు అందుబాటులోకి వస్తాయి. దాంతో విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాలకు బుధవారం సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు రోజుల నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిషాకు కూడా రవాణా మార్గాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేసి, రైలు మార్గాలను పునరుద్ధరించారు. మరోవైపు.. కొన్ని ఏటీఎం కేంద్రాలు కూడా ఇప్పుడిప్పుడే పనిచేయడం ప్రారంభించాయి. దాంతో డబ్బులు తీసుకోడానికి వాటి ముందు భారీ క్యూలలో ప్రజలు వేచిచూస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా ఈ క్యూలలో వేచి చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల తర్వాత వీటిలో రెండు మూడు కేంద్రాలు పనిచేస్తుండటంతో చాలామంది డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లారు. తుఫాను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి వద్దా ఇళ్లలో పెద్దగా డబ్బులు లేకపోవడం, ఏటీఎంలలో ఇన్వర్టర్లు విద్యుత్ సరఫరా లేక ఛార్జింగ్ అయిపోయి అవి పనిచేయడం మానేశాయి. అసలే ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతుండటం, మరోవైపు డబ్బు లేకపోవడంతో విశాఖ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు వాళ్ల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం కనిపిస్తోంది. -
ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ
-
ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ
తుఫాను కారణంగా రైల్వేలైన్లు దెబ్బతిన్న కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. యలమంచిలి వద్ద సింగిల్ ట్రాకు మరమ్మతులు చేయడంతో ఇది సాధ్యమైంది. సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ బయల్దేరుతుంది. అలాగే హౌరా- యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రాత్రి 11.45 గంటలకు బయల్దేరుతుంది. భువనేశ్వర్ - ముంబై ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూరు - డిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 4.30 గంటలకు మొదలవుతుంది. అయితే కొన్ని రైళ్లు మాత్రం రద్దయ్యాయి. సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం కూడా రద్దయింది. షాలిమార్ - చెన్నై ఎక్స్ప్రెస్ రద్దయింది. సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ రైలు రద్దయింది. విజయవాడ - విశాఖ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను సామర్లకోట వరకే పరిమితం చేశారు. అలాగే విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను సామర్లకోట నుంచే నడిపిస్తున్నారు.