రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సారంగాపూర్, న్యూస్‌లైన్ : కమ్మునూర్ శివారులో గురువారం సాయంత్రం ట్రాలీఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ధర్మపురి నుం చి కమ్మునూర్ మీదుగా మంగే ళ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ జిల్లా కలమడుగు నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రాలీ ఆటోను కమ్మునూర్ శివారులో ఢీకొట్టింది.
ట్రాలీ వెనుక నిల్చున్న మ్యాదరవే ని గంగమల్లు (60) తలకు ఇనుపచువ్వలు గుచ్చి ట్రాలీలో పడిపోయాడు, తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న పెద్దగొల్ల మల్లేశ్, సల్ల రాజన్న, జక్కుల చంద్రయ్య, చెర్ల సత్తయ్య, ట్రాలీ డ్రైవర్ బుడిగె శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడితోపాటు, గాయపడ్డ నలుగురి స్వగ్రామం మండలంలోని కొ ల్వాయి. డ్రైవర్ జగిత్యాలకు చెందినవాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై గంగారెడ్డి సందర్శించి గాయపడ్డవారిని 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.