transfer councelling
-
ఆయుష్ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్ : ఆయుష్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జేసీ–2 ఖాజామొహిద్దీన్ పర్యవేక్షణలో ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీడీ) వెంకట్రామ్ నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, నేషనల్ హెల్త్ మిషన్ డీపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, డీఐఓ డాక్టర్ పురుషోత్తం సమక్షంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రుల్లో పని చేస్తున్న 24 మంది కాంపౌండర్లు, 17 మంది క్లాస్–4 ఉద్యోగులకు బదిలీ చేశారు. ఎన్జీఓ సంఘం లేఖలతో వచ్చిన ఇద్దరు ఉద్యోగులకు యథాస్థానాల్లో ఉంచారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ తిరుపతినాయుడు, డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నేడు ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయ మీటింగ్ హాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీహెచ్ఏ, ఎల్డీ కంప్యూటర్, ఎఫ్డబ్ల్యూడబ్ల్యూ, ఫార్మసిస్టులు, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్స్, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, స్వీపర్లు, వాచ్మన్లు తదితర కేడర్ల ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఉంటుంది. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేసీ–2 ఖాజామొహిద్దీన్ రానున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేశ్‌నాథ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరుగుతుంది. అన్ని కేడర్లకు సంబంధించి బదిలీలకు 295 మంది అర్హులున్నట్లు అధికారులు తేల్చారు.