transient
-
జీవన్ భద్రాణి పశ్యంతు
మన పూర్వులు పిల్లలకి జీవితం మీద ఆశని కలిగించి ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా సానుకూల దృక్పథం పెం΄÷ందే విధంగా మనసులని మలచేవారు. అందుకే ఒకప్పుడు ఆత్మహత్యల వంటివి అంతగా కనపడేవి కావు. ఎక్కడో ఒకటి జరిగితే అదేదో వింత అన్నట్టు అందరూ కంగారు పడేవారు. ఇప్పుడు అవి అతి సామాన్యమై ΄ోయాయి. అది చాలా మామూలు విషయంగా పరిగణించి పెద్దగా పట్టించుకోవటం కూడా లేదు. ప్రతిస్పందించే సున్నితత్వాన్ని కూడా కోల్పోయాం. ‘‘బ్రతికి యుండిన సుఖములు బడయ వచ్చు’’ అన్నది భారతీయుల విశ్వాసం. ఇటువంటి భావాలని అతి సామాన్యమైన మాటలలో అందరి మనస్సులలో నాటుకునేట్టు చేశారు. బ్రతుకుని అంతం చేసుకోవాలనే ఆలోచనే రాకుండా వాతావరణాన్ని ఉంచేవారు. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చావో రేవో అన్నంత తీవ్రంగా తీసుకునే వారు కాదు. ‘‘కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా?’’ అని తేలిక చేసేవారు, మనం అందరం మనుషులం అని గుర్తు చేస్తూ. ఈనాడు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది చిన్నతనంలో కడుపునిండా తిండి కూడా లేనివారు అని వారి జీవితచరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ‘‘బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అని చెప్పి సాంత్వన కలిగించే వారు. పైగా, ఆ రోజుల్లో అనుకున్నది సాధించక ΄ోవటం, పరాజయాల పాలు కావటం జరిగి, తాత్కాలికంగా నిరాశ కలిగినా వెంటనే తేరుకుని రెట్టించిన ఉత్సాహంతో లేదా కసితో అనుకున్న దానిని సాధించటానికి ప్రయత్నం చేసేవారు. తాము విఫలం కావటానికి కారణం ఏమిటి? అని విశ్లేషించుకునేవారు. ఇది కార్యసాధకుల లక్షణం. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, పూల పానుపూ కాదు. ఈ ఆలోచనా విధానం నేటి యువతరంలోను, మధ్యవయస్కులలోనూ మృగ్యం అయింది. తక్షణం అనుకున్న ఫలితం రావాలి, తన ప్రయత్నంతో సంబంధం లేకుండా. అపజయాన్ని, ఓటమిని అసలు ఎదుర్కో లేరు. కొంచెం కూడా ఆగలేరు. నిర్ధారణ చేసుకునే ఓపిక కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో ΄÷రపాటు పడే అవకాశం కూడా ఉంది. మనం చూస్తూనే ఉంటాం. మొదటి వంద స్థానాల్లో ఉండవలసిన అభ్యర్థి ఉత్తీర్ణుడు కాలేదని ప్రకటన రాగానే తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్న మరునాడు ఆ ప్రకటన తప్పు అని సరి చేసుకోటం తెలుసు కదా! మనసుని ఆ మాత్రం అదుపులో ఉంచలేక ΄ోవటం వల్ల వచ్చిన ప్రమాదం అది. ప్రాణాలు అర్పించి సాధించారు, బలిదానం చేశారు అంటూ ΄÷గిడితే వారికి ఒరిగేది ఏముంది? మిగిలిన వారు అనుభవించ వచ్చు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. సమయం పట్టవచ్చు. మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్పే మాట ఏమంటే, ప్రాణత్యాగం చేయదల్చుకున్న వారిని ఒక్క క్షణం ఆపగలిగితే చాలు నట. క్షణికావేశం చల్లారుతుంది అంటారు. ఆ పనిని ఎవరు చేయగలరు? అసలు ఎవరికైనా తెలియాలి కదా! అందుకే ఎవరికి వారే తమను తాము సముదాయించుకుని, పరిస్థితులతో ΄ోరాడి గెలవాలి. కలిగిన మేలు అనుభవించటానికి బ్రతికి ఉండాలి కదా!ఈ బతుకుని అంతం చేసుకోవాలనే భావన ఎవరికీ రాదా? సీతమ్మకి, హనుమకి, రామచంద్రమూర్తికి, దుర్యోధనుడి వంటి వారికే వచ్చింది. కాని విచక్షణ వారిని ఆపని చేయకుండా కాపాడింది. సీతమ్మ కనపడలేదని హనుమ ఏ విధంగా శరీరం వదలాలి అని ఆలోచిస్తూ సీతారామలక్ష్మణులకి, సుగ్రీవాదులకి నమస్కారం చేయగానే అశోకవనం కనపడింది. దైవాన్ని, పెద్దలని స్మరిస్తే మార్గం కనపడుతుంది. సీత కూడా జుట్టుతో చెట్టు కొమ్మకి ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉండగా త్రిజట మాటలు, హనుమ దర్శనం కలిగాయి. తొందర పడితే? రాముడు కూడా సీత లేకుండా ఉండలేనని అనుకుని, అరణ్యవాసం చేయలేదనే చెడ్డపేరు వస్తుందని ఆగాడు. ఆవేశ పడకుండా కొద్దిగా ఆలోచిస్తే మంచి జరిగి తీరుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీలా మారిపోయాడు!
లైమ్‌రిక్ (ఐర్లాండ్): ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీగా మారిపోయాడు. ఒకట్రెండు రోజులుగా జరిగినవేవీ జ్ఞాపకానికి రాక కిందా మీదా పడ్డాడు. 66 ఏళ్ల ఆ వ్యక్తి భార్యతో గడిపిన 10 నిమిషాలకు మొబైల్లో తేదీ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్ల పెళ్లి రోజు. అంత ముఖ్యమైన విషయం మర్చిపోయానే అంటూ బాధపడిపోయాడు. నిజానికతను భార్యతో, కూతురితో కలిసి ముందు రోజు సాయంత్రం పెళ్లి రోజును చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అవేమీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. దాంతో, పెళ్లి రోజున సరదాగా గడిపామని భార్య, కూతురు ఎంత చెప్పినా ఓ పట్టాన నమ్మలేదు. ‘‘నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? నేను ఏమేం చేశాను? ఒక్కటీ వదలకుండా చెప్పండి’’ అంటూ వారిని పదేపదే అడిగాడు. పోనీ జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే తన పేరు, వయసు వంటి పాత విషయాలన్నీ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి. ఇక లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయించినా సాధారణంగా మతిమరుపుకు దారితీసే నరాల సమస్య వంటివేమీ లేవని, అంతా మామూలుగానే ఉందని తేలింది. మరి ఈ తాత్కాలిక మరుపేమిటో అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. కాసేపటికే ముందు రోజు జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా పబ్లిషైంది. అతని సమస్యను ఒక రకమైన షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌గా గుర్తించినట్టు వ్యాసకర్త వివరించారు. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారముంటుందన్నారు. ‘‘శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చి పడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు’’ అని వివరించారు. కొసమెరుపు ఈ ఉదంతంలోని కథానాయకునికి 2015లోనూ ఇలాంటి తాత్కాలిక మతిమరుపు వచ్చిందట. అది కూడా ఎప్పుడో తెలుసా? భార్యతో సన్నిహితంగా గడిపిన 10 నిమిషాలకే! -
ఇదో అస్థిర దశ అన్న జైట్లీ!
న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీలో ఇప్పటికే అమల్లో ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాల నిషేధం దేశంలోని మరో పదకొండు నగరాల్లో అమల్లోకి రానుంది. ఇందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కత్తా, పాట్నా, అలహాబాద్, లక్నో, వారణాసి, పూనే, కాన్పూర్, నాగ్ పూర్, జలంధర్, లూధియానా, అమృత్ సర్ నగరాల్లో డీజిల్ వాహనాల నిషేధం అమల్లోకి తెచ్చేందుకు ఎన్జీటీ నిర్ణయించింది. ఆయా నగరాల్లోని కాలుష్యం ఆధారంగా ఎన్జీటీ నిషేధాన్ని అమల్లోకి తేనుంది. ఈనేపథ్యంలో తమ నిర్ణయం మార్చుకోవాలంటూ ఢిల్లీ భారీ పరిశ్రల శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను అభ్యర్థించింది. ఇప్పటికే వారం క్రితం పదేళ్ళు దాటిన డీజిల్ వాహనాలు కేరళ రాజధాని తిరువనంతపురం, పర్యాటక పట్టణం కోచీ సహా రాష్ట్రంలోని ఆరు నగరాల్లో రోడ్లపైకి రావడాన్ని నిషేధిస్తూ ఎన్జీటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలోని మరో 11 నగరాల్లో డీజిల్ వాహనాలు నిషేధించాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ తాజా నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా కార్ల తయారీ దార్లకు ఎన్జీటీ నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరు రోజుల టోక్యో పర్యటనకు వెళ్ళిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశంలో ఆటోకంపెనీలపై మార్కెట్ ప్రతికూలత ప్రభావం, ఆటో పరిశ్రమల్లో పెట్టుబడుల అస్థిరత్వం వంటి విషయాలపై సుజికి మోటార్ ఛైర్మన్ ఒసామును కలసి చర్చించారు. భారతదేశంలో ఆటోరంగం అభివృద్ధి మార్గంలో నడుస్తుందని, ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు అశాశ్వతమైనవేనని అన్నారు. పైగా సుజికి వంటి భారీ పరిశ్రమలపై ఇటువంటి ప్రభావాలు పడే అవకాశం ఉండదని జైట్లీ అభిప్రాయ పడ్డారు. 2015 డిసెంబర్ నుంచి ఢల్లీ పరిసరప్రాంతాల్లో డీజిల్ వాహనాల అమ్మకాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. కాలుష్య సాకారంగా మారుతున్న హస్తినలో డీజిల్ కార్లు వినియోగం నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ డీజిల్ వాహనాల అమ్మకాలను నిలిపివేశారు. అనంతరం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కూడ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే భారీ డీజిల్ కార్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహనాల అమ్మకాల నిషేధం వల్ల ఆటో పరిశ్రమ తీవ్ర నష్టాల బారిన పడటంతోపాటు, పెట్టుబడులను తీవ్రంగా కోల్పోవాల్సి వచ్చింది. అదే కారణంతో సుమారు పదకొండు వేల వాహనాల ఉత్పత్తికూడ నిలిచిపోయింది. అంతేకాక పరిశ్రమల్లో సుమారు ఆరువేలమంది వరకూ ఉద్యోగాలను కూడ కోల్పోయారు. డీజిల్ కార్ల నిషేధం దేశం మొత్తం అమల్లోకి తెస్తే సుమారు ఏభై వేల వరకూ ఉద్యోగాలను కోల్పోవాల్సివస్తుందని సియామ్ రిపోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఆటో పరిశ్రమల యజమానులు తిరిగి పెట్రోల్ వాహనాలు, చిన్న డీజిల్ ఇంజన్లను ప్రవేశ పెట్టే ప్రయత్నాలను చేస్తుంటే... నిషేధం పూర్తిగా ఏకపక్ష నిర్ణయం అని సుజికి ఇండియా ఛైర్మన్ సి భార్గవ అన్నారు. ఇటువంటి నిబంధనలు భారతదేశానికే తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ప్రపంచంలోనే అతి పెద్ద ఆటో సంస్థ టయోటా అభిప్రాయ పడింది. ఇకనైనా ఆటో పరిశ్రమల శాఖ విన్నపాలను స్వీకరించి ఎన్జీటీ నిర్ణయం మార్చుకుంటుందో, అనుకున్నట్లుగానే పదకొండు నగరాల్లో అమలు చేస్తుందో వేచి చూడాలి.