టీఎస్ఆర్టీసీ ఎండీకి అరుదైన గుర్తింపు
ఏఎస్ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియామకం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఎండీ రమణారావుకు అరుదైన గుర్తింపు లభిం చింది. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీ యూ) స్థాయి సంఘం చైర్‌పర్సన్‌గా రమణా రావు నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. రోడ్డు రవాణా సంస్థలు ఉమ్మడిగా అమలు చేయా ల్సిన నిబంధనలు రూపొందించడంలో ఈ స్థాయి సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్డు రవాణా సంస్థలకు సూచనలు ఇవ్వడం తోపాటు అత్యంత కీలకమైన రవాణా విధానం రూపొందించటంలో కేంద్రానికి సిఫార్సు లు చేస్తుంది. దేశంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య జోన్ల నుంచి ముగ్గురు చొప్పున, రాష్ట్రం నుంచి ఒకరు మించ కుండా కమిటీలో 15 మంది సభ్యులుంటా రు. దేÔèట్రాన్స్‌పోర్టు పాలసీ రూప కల్పనలో దీనిదే కీలక భూమిక.
సబ్సిడీ బస్సులొచ్చేలా కృషి: రమణారావు
పట్టణ ప్రాంతాలకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద భారీ సబ్సిడీతో రవాణా బస్సులను కేంద్రం అందిస్తుండటంతో పట్టణ ప్రయాణికులకు రవాణా వసతి మెరుగవు తోందని, గ్రామీణ ప్రాంతాలకు అవకాశం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని రమణారావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకూ బస్సులు సరఫరా చేసేలా సిఫారసుకు కృషి చేస్తానని చెప్పారు. డిజిటల్ లావాదేవీలు రవాణా సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉందన్న కారణంతో రవాణా సంస్థలు బస్సులను ఉపసంహరించుకుంటున్నాయని, ఇది గ్రామీణ ప్రాంతాలకు శాపంగా మారిందన్నారు.