టేకాఫ్ అవుతున్న సమయంలో..
జకర్తా: టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఢీ కొన్న ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాలో చోటు చేసుకుంది. వెంటనే చర్యల చేపట్టిన ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని విమాన సర్వీసులను తాత్కలికంగా నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు. ప్రధాన ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకల రద్దీని అదుపు చేసేందుకు దగ్గరలోని మిలటరీ విమానాశ్రయాన్ని వినియోగిస్తున్నారు.
బతిక్ ఎయిర్‌కు చెందిన విమానం 49 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో టేకాఫ్ అవుతుండగా, అదే సమయంలో ట్రాన్స్నూసకు చెందిన ఎయిర్‌క్రాప్ట్ విమానం కూడా బయల్దేరడంతో రెండు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బతిక్ ఎయిర్‌కు చెందిన విమానం రెక్క తీవ్రంగా దెబ్బతింది.