Transparent Government
-
Ram Mandir Ayodhya: పాలనలో రాముడే స్ఫూర్తి: మోదీ
షోలాపూర్/: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముని స్ఫూర్తితో నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను చరిత్రాత్మక సందర్భంగా అభివరి్ణంచారు. ఆ రోజున దేశమంతటా ఇంటింటా రామజ్యోతిని వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. అది పేదరిక నిర్మూలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధానిగా తాను మూడోసారి విజయం సాధించాక ‘మోదీ హామీ’ల దన్నుతో భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 90 వేలకు పైగా ఇళ్లను లాంఛనంగా పేదలకు అందజేశారు. పీఎం స్వానిధి పథకం కింద 10 వేల మంది లబ్ధిదారులకు ఒకటో, రెండో వాయిదాల చెల్లింపుకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘దేశమంతటా గొప్ప ఆధ్యాతి్మక వాతావరణం నెలకొని ఉంది. నాసిక్‌లో గత వారం అనుష్టానం మొదలు పెట్టాను. మీ ఆశీస్సులతో అయోధ్య వెళ్తున్నా’’ అని ప్రకటించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను చూస్తుంటే తన హృదయం ఆనందంతో నిండిపోతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యంలో తనకిలాంటి ఇంట్లో ఉండే అవకాశం లేకపోయిందని చెమర్చిన కళ్లతో గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రజల కలలు నెరవేరినప్పుడే నిజమైన ఆనందం. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద పెట్టుబడి. గత ప్రభుత్వాల్లో పేదల సంక్షేమానికి కావాల్సిన నియత్ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ట (చిత్తశుద్ధి) లోపించాయి. పేదల సంక్షేమం, శ్రామికుల గౌరవం కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు, 10 కోట్లకు పైగా టాయ్లెట్లు నిర్మించాం’’ అని చెప్పారు. బోయింగ్ క్యాంపస్ ప్రారంభం దొడ్డబళ్లాపురం/సాక్షి, చెన్నై: భారత్ శరవేగంగా సాధిస్తున్న ప్రగతిని అందిపుచ్చుకోవాల్సిందిగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మోదీ పిలుపునిచ్చారు. పాతికేళ్లలో సంపన్న భారత నిర్మాణమే ప్రతి భారతీయుని లక్ష్యంగా మారిందన్నారు. ఆ దిశగా 25 కోట్ల భారతీయులను గత తొమ్మిదేళ్లలో పేదరికం నుంచి బయటికి తీసుకొచి్చనట్టు చెప్పారు. వైమానిక రంగంలోనూ దేశం శరవేగంగా ప్రగతి సాధిస్తోందని హర్షం వెలిబుచ్చారు. బెంగళూరు శివార్లలో దేవనహల్లి హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ క్యాంపస్‌లో రూ.1,600 కోట్లతో నిర్మించిన బోయింగ్ నూతన గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. భారత సామర్థ్యంపై ప్రపంచం పెట్టుకున్న నమ్మకానికి ఈ క్యాంపస్ తాజా నిదర్శనమన్నారు. భారత్ గత కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశీయ వైమానిక మార్కెట్‌గా ఎదిగిందని గుర్తు చేశారు. అనంతరం మూడు రోజుల తమిళనాడు పర్యటన నిమిత్తం మోదీ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, బీజేపీ మద్దతుదారుల స్వాగతం నడుమ నెహ్రూ స్టేడియం దాకా 4 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిపారు. అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2023ను ప్రారంభించారు. 2029 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు వేదికగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. మహిళలే వృద్ధి సారథులు భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల సారథ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు మోదీ చెప్పారు. వైమానిక రంగంలోనూ మహిళలకు నూతన అవకాశాలు కలి్పంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుద్దేశించిన ‘బోయింగ్ సుకన్య’ పథకాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. భారత పైలట్లలో 15 శాతం మహిళలేనని మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువన్నారు. సుకన్య పథకం కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) తదితరాల్లో విద్యాభ్యాసానికి అమ్మాయిలకు అవకాశం కలి్పంచి వైమానిక రంగ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతామని బోయింగ్ ప్రకటించింది. పైలట్ శిక్షణకు మహిళలకు స్కాలర్íÙప్లు ఇస్తామని పేర్కొంది. సిద్ధూ, అది సహజం! ‘మోదీ.. మోదీ’ నినాదాలపై ప్రధాని బెంగళూరు బోయింగ్ క్యాంపస్ ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని ప్రసంగిస్తుండగా సభికులంతా మోదీ, మోదీ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆయన కాసే పు ప్రసంగాన్ని ఆపేసి వింటూ ఉండిపోయారు. వేదికపై కూర్చు ని దీనంతటినీ తిలకిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వైపు తిరిగి, ‘‘ముఖ్యమంత్రీ జీ! ఐసా హోతా రహతా హై (అలా జరుగుతూంటుంది) అంటూ చమత్కరించారు. దాంతో సీఎంతో పాటు వేదికపై ఉన్న గవర్నర్ తదితరులు చిరునవ్వులు చిందించారు. -
పారదర్శకథ కంచికేనా?
సాక్షి, సిద్దిపేట: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ – సర్వీసెస్ ప్రక్రియ జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో జీరోదందాకు అడ్డుకట్ట పడటం లేదు. మార్కె ట్ యార్డుల్లో ఈ – సర్వీసెస్ ప్రక్రియను అమలు చేస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో ట్రేడర్, కమీషన్ ఏజెంట్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల అప్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలోకి సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, చేర్యాల, హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ, కొండపాక, తొగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్, వంటిమామిడి కలుపుకొని మొత్తం 14 ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కందులు పెద్ద ఎత్తున మార్కెట్‌కు వస్తాయి. గజ్వేల్‌లో పత్తి, మక్క, వరి, శనిగలు, హుస్నాబాద్‌లో వరి, మక్క, పత్తి ఉత్పత్తులు ప్రధానంగా క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ లెక్కన 14 యార్డుల్లో 2018 – 19 ఖరీఫ్ సీజన్లో రూ.240కోట్ల విలువైన ధాన్యం క్రయవిక్రయాలు జరిగాయి. రబీ సీజన్లో రూ.121కోట్ల విలువైన ధాన్యం అమ్మకాలు జరిగాయి. ఖరీఫ్‌లో 87కోట్ల విలువలైన మక్క, 17కోట్ల విలువైన కందుల అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వానికి 2018 – 19 సీజన్లో ధాన్యం క్రయవిక్రయాలకు రూ.2.45కోట్లు మార్కెట్ ఫీజు రూపంలో ఆదాయం రాగా, రబీలో రూ. 1.21కోట్లు వచ్చింది. మక్కలకు సంబంధించి రూ.87లక్షలు, కందులకు రూ.17లక్షలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు సుమారు రూ.5కోట్ల వరకు మార్కెటింగ్ ఫీజు రూపంలో ఆదాయం వచ్చింది. అడుగు పడితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ – సర్వీసెస్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం దశల వారీగా ఆయా జిల్లాల్లో ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు 40కి పైగా మార్కెట్ యార్డుల్లో ఈ – సర్వీసెస్ సేవలు లేకపోవడం విశేషం. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని 14 మార్కెట్ కమిటీల్లో ప్రస్తుతం మాన్యువల్ ద్వారానే ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో వాస్తవ లెక్కలకు పొంతన లేకుండా ఆదాయం తగ్గిపోతోంది. ప్రధానంగా ట్రేడర్లు యార్డుల్లో ధాన్యం నిల్వలను, అమ్మకాలను మాన్యువల్ ప్రక్రియతో అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఈ – సర్వీసెస్‌తో పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో మాన్యువల్ పద్ధతి కొనసాగుతుండటంతో చెక్‌పోస్టుల్లో రవాణాకు సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సిద్దిపేట, గజ్వేల్ మార్కెట్ యార్డుల్లో ఈనామ్ పద్ధతిని అమలు చేయడంతో ప్రస్తుతం జిల్లాలోని రెండు మార్కెట్‌యార్డుల్లో మాత్రమే ఈనామ్ వ్యవస్థ అమలవుతోంది. దశల వారీగా ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా, దశల వారిగా ఈ – సర్వీసెస్‌ను అమలు చేస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో ప్రస్తుతం ప్రక్రియ అమలు జరగడం లేదు. సిద్దిపేట జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలోని ట్రేడర్లు, కమీషన్ ఏజంట్ల వివరాలను, అవసరమైన ధ్రువీకరణ పత్రాల సేకరణలో నిమగ్నమై ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. ఈ – సర్వీసెస్ ప్రక్రియ అమలైతే పారదర్శకత పెరిగి అక్రమాలు కట్టడి అవుతాయి. – నాగరాజు, జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ ప్రస్తుతం ధ్రువీకరణ పత్రాల నమోదు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ –సర్వీసెస్ అమలును చేపట్టిన సంబంధిత శాఖ అధికారులు ప్రస్తుతం ట్రేడర్ల, కమీషన్ ఏజెంట్ల ధ్రువీకరణ పత్రాల సేకరణకే పరిమితం కావడం విశేషం. మార్కెట్ల వారీగా ట్రేడర్లు, కమీషన్ ఏజంట్ల వివరాలు, ఈమెయిల్ ఐడీలు, ఆధార్‌కార్డులు, లైసెన్స్ ధ్రువీకరణ పత్రాలు, సేకరించే పనిలో పడ్డారు. సంబంధిత పూర్తి వివరాలను సేకరించిన అనంతరం వాటిని రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు అనుసంధానం చేయాలి. పూర్తి స్థాయిలో వివరాల నమోదు అనంతరం ఈ – సర్వీసెస్ ప్రక్రియను అమలు చేస్తూ ట్రేడర్ల వారీగా లైసెన్సింగ్, క్రయవిక్రయాలు, ట్రేడర్ల వద్ద నిల్వలు, మార్కెట్ ఫీజు చెల్లింపు తదితర అంశాలను ఆన్లైన్లో నమోదు చేస్తే పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో 279 మంది ట్రేడర్ల వివరాలు, 143 మంది కమీషన్ ఏజెట్ల వివరాలను మాత్రమే నమోదు చేసిన మార్కెట్ శాఖ మరో అడుగు ముందుకు వేస్తే జిల్లాలో ఈ – సర్వీసెస్ లక్ష్యం పూర్తవుతుంది. -
పారదర్శక పాలనకు మోడీ 10 సూత్రాలు!
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ భేటీలో మంత్రులకు పారదర్శక పాలనకు 10 సూత్రాల్ని ప్రధాని నరేంద్ర మోడీ బోధించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో మోడీ అధికారుల్లో విశ్వాసం కల్పించాలని మార్గనిర్దేశం చేశారు. పటిష్టమైన ప్రభుత్వ పాలన కోసం కొత్త ఆలోచనలను స్వాగతించాలని మోడీ సూచించారు. విద్య, ఆరోగ్యం, తాగునీరుకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలనలో పాదర్శకత ఉండాలని కేంద్రమంత్రులకు తెలియ చేశారు. మంత్రివర్గ సభ్యుల మధ్య సమన్వయ వ్యవస్థ ఉండాలని, ప్రజాభీష్ణంగా విధానాలు ఉండేలా చూసుకోవాలని, ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సహచరులతో మోడీ అన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు అమలు చేయాలని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం, సమర్థత ఉండాలని, నిర్ణీత సమయంలోగా విధానాలు అమల్లోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని నరేంద్ర మోడీ తెలిపారు.