పారదర్శక పాలనకు మోడీ 10 సూత్రాలు!
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ భేటీలో మంత్రులకు పారదర్శక పాలనకు 10 సూత్రాల్ని ప్రధాని నరేంద్ర మోడీ బోధించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో మోడీ అధికారుల్లో విశ్వాసం కల్పించాలని మార్గనిర్దేశం చేశారు. పటిష్టమైన ప్రభుత్వ పాలన కోసం కొత్త ఆలోచనలను స్వాగతించాలని మోడీ సూచించారు. విద్య, ఆరోగ్యం, తాగునీరుకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలనలో పాదర్శకత ఉండాలని కేంద్రమంత్రులకు తెలియ చేశారు.
మంత్రివర్గ సభ్యుల మధ్య సమన్వయ వ్యవస్థ ఉండాలని, ప్రజాభీష్ణంగా విధానాలు ఉండేలా చూసుకోవాలని, ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సహచరులతో మోడీ అన్నారు.
మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు అమలు చేయాలని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం, సమర్థత ఉండాలని, నిర్ణీత సమయంలోగా విధానాలు అమల్లోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని నరేంద్ర మోడీ తెలిపారు.