Transport Ministry
-
వాహనదారులూ బీ అలర్ట్: కొంపముంచుతోంది అదే!
ప్రతీ రోజు దేశం నలుమూలల్లో చోటుచేసుకునే అనేక వాహన ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. స్వయం కృతాపరాధంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంఘటనలు కలిచి వేస్తాయి. డ్రైవింగ్‌పై క్రేజ్ తో స్పీడ్‌గా వెళ్లడం థ్రిల్ కావచ్చు, కానీ అది ప్రమాదకరం. మన ప్రాణాలకే కాదు ఇతరులకు కూడా. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూసే ఓపిక లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్లు ఉపయోగించడం ఈ రోజుల్లో సాధారణమై పోయింది. ‘‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’’ అనే మాటల్ని తాజా ప్రభుత్వ ఒక సంచలన నివేదిక మరోసారి గుర్తు చేసింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2022” నివేదిక ప్రకారం, భారతదేశంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాలకు అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా 2022 నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకు 122 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. 1970 నుంచి ఇదే అత్యధిక రేటు దేశవ్యాప్తంగా ప్రమాదాలు , మరణాల వెనుక అతివేగం ప్రధాన కారణాలలో ఒకటిగా తేలింది. 2022లో 11.9శాతం పెరిగి 4,లక్షల 61వేల 312 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2021లో వీటి సంఖ్య 4 లక్షల 12వేల 432గా ఉంది. 1 లక్షా 68వేల 491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 43వేల 366 మంది గాయపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే మరణాలు 9.4 శాతం ఎగిసి క్షతగాత్రుల సంఖ్య 15.3శాతం పెరిగింది. 2022లో 3.3 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలకు దారితీసిన కారణాల్లో అతివేగంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2022లో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అతివేగం కారణంగా 71.2 శాతం మంది మరణించారు, ఆ తర్వాత స్థానం రాంగ్ సైడ్ డ్రైవింగ్ది (5.4శాతం) అని నివేదిక పేర్కొంది. ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10వేల ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అంతేకాదు రెడ్‌సిగ్నల్ జంప్ వల్ల యాక్సిడెంట్లు గణనీయంగా పెరిగాయి. 2021లో ఇవి 2,203గా ఉంటే 2022లో 82.55 శాతం పెరిగి 4,021 ప్రమాదాలు నమోదైనాయి. 2022లో హెల్మెట్ ధరించని బైక్ ప్రమాదాల్లో 50వేల మంది మరణించారు. వీరిలో 71.3 శాతం మంది ( 35,692) డ్రైవర్లు, 14,337 (28.7శాతం) వెనుక కూర్చున్న వారు అని నివేదిక పేర్కొంది. -
వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!
భారతదేశంలో కొత్త వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో పాత వాహనాల వినియోగం తగ్గుతోంది, దీనివల్ల నిరుపయోగంగా ఉన్న వాహనాల సంఖ్య ఎక్కువవుతోంది. ఇలాంటి వాహనాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. దేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి కొంతకాలం క్రితమే స్క్రాప్ విధానాన్ని అమలులోకి వచ్చింది. వెహికల్ స్క్రాపేజ్ విధానంలో వాహనాలను స్క్రాప్ చేయడానికి ఎటువంటి వయోపరిమితిని నిర్దేశించలేదని, 10 సంవత్సరాల వినియోగం తర్వాత వ్యవసాయ ట్రాక్టర్లను విస్మరిస్తున్నట్లు వచ్చిన నివేదికలు నిరాధారమైనవని, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ వ్యవధి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మళ్ళీ ఒకేసారి ఐదేళ్లపాటు మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు ప్రస్తావించింది. పది సంవత్సరాల తరువాత వినియోగంలో ఉన్న ట్రాక్టర్లను తప్పనిసరిగా స్క్రాపింగ్ చేయడం గురించి ట్విటర్, వాట్సాప్‌తో సహా కొన్ని సోషల్ మీడియాలో వెల్లడవుతున్న వార్తలు నిజం కాదని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) కొన్ని ప్రభుత్వ వాహనాలకు కాకుండా ఇతర ఏ వాహనాలకు నిర్ణీత వయోపరిమితిని భారత ప్రభుత్వం నిర్ణయించలేదు, MoRTH వాలంటరీ వెహికల్ ఫ్లీట్ ఆధునీకరణ కార్యక్రమం లేదా వాహన స్క్రాపింగ్ విధానాన్ని రూపొందించింది, దీని ప్రకారం రవాణాకు పనికి రాకుండా ఉండే వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా పరీక్షించిన తర్వాత వాహనం ఫిట్‌గా ఉన్నంత వరకు రోడ్డుపై నడపవచ్చని నివేదికలు చెబుతున్నాయి. -
వాహనదారులకు షాక్! ఇప్పుడు ఇవి కూడా పెంచేశారు!!
ధరల పెరుగుదల, పన్ను పోటు, సబ్సిడీల కోత, రాయితీలకు మూత.. ఇలాగే కొనసాగుతోంది కేంద్రం వ్యవహారం. అదుపు తప్పిన ద్రవ్యోల్బణంతో ఇప్పటికే బతుకుబండి లాగించడం కష్టంగా మారింది. పెట్రోలు, డీజిల్ ధరలు తలచుకుంటేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్.. ఇప్పుడున్నవి చాలవనీ మరో భారాన్ని వాహనదారులపై మోపింది కేంద్రం. వెహికల్ ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ఇన్సురెన్సు చేయించడం తప్పనిసరి చేశారు. అయితే ఇన్సురెన్సులో అనేక కేటగిరీలు ఉన్నా తక్కువ ప్రీమియంతో అందరికీ అందుబాటలో ఉండేది థర్డ్ పార్టీ ఇన్సురెన్స్. ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే వాహానదారులు థర్డ్ పార్టీ ఇన్సురెన్సును క్రమం తప్పకుండా చెల్లిస్తుంటారు. ఇప్పుడీ థర్డ్ పార్టీ ఇన్సురెన్సు చెల్లింపులను పెంచింది కేంద్రం. సవరించిన ధరలు 2022 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన థర్డ్‌పార్టీ ఇన్సురెన్సు వివరాలు ఇలా ఉన్నాయి. - 1000సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్లకు థర్డ్‌పార్టీ ఇన్సురెన్స్‌ను రూ.2,094గా నిర్ణయించారు. గతంలో 2019-20లో ఈ మొత్తం రూ.2,072గా ఉండేది - 1000 నుంచి 1500 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్లకు రూ.3,416గా థర్డ్‌పార్టీ ఇన్సురెన్సు అమల్లోకి రానుంది. గతంలో ఇది రూ.3,221కి పరిమితమైంది. - చిత్రంగా బడాబాబులు ఎక్కువగా ఉపయోగించే 1500 సీసీ ఆపై సామర్థ్యం కలిగిన కార్లకు థర్డ్‌పార్టీ ఇన్సెరెన్సును రూ.7,890గా సవరించింది. గతంలో ఇది మరో రూ.7,897గా ఉండేది. ఈ ఒక్క కేటగిరీలోనే రూ.7 ప్రీమియం తగ్గింది. - ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 150 నుంచి 350 సీసీ వరకు థర్డ్‌పార్టీ ప్రీమియం రూ. 1,366గా నిర్ణయించారు. 350 సీసీ ఉన్న బైకులకు ఈ మొత్తం రూ.2,804గా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి - ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి 30 కిలోవాట్స్ సామర్థ్యం ఉంటే థర్డ్‌పార్టీ ఇన్సురెన్సు రూ.1,780గా నిర్ణయించారు. 30 నుంచి 65 కిలోవాట్స్ మధ్యన అయితే రూ.2,904గా ఉంది. - కమర్షియల్ గూడ్స్ క్యారియర్లకు (12,000 కేజీల నుంచి 20,000 కేజీలు) సంబంధించి థర్డ్‌పార్టీ ప్రీమియంని రూ.35,313లకు పెంచారు. గతంలో ఇది రూ.33,414గా ఉండేది. ఇక 40 వేల కేజీలు దాటిన కమర్షియల్ వెహికల్స్‌కి రూ.44,242గా ప్రీమియం ఉంది. కేంద్రం చేతుల్లోకి గతంలో వాహనాల ఇన్సురెన్సులు విధివిధానాలను ఇన్సురెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఐఏ) ఆధీనంలో ఉండేది. కాగా ఈసారి ఈ బాధ్యతలు కేంద్రం తీసుకుంది. ఈ మేరకు తొలిసారిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ థర్డ్ పార్టీ ఇన్సురెన్సుల సవరణ బాధ్యతలు తీసుకుంది. చదవండి: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు -
రోడ్లతో కాసుల వర్షం.. రూ.లక్ష కోట్లు!
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ద్వారా వచ్చే ఐదేళ్లలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.లక్ష కోట్లను సమీకరించే ప్రణాళికతో ఉన్నట్టు కేంద్ర రవాణా, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రంగంలోని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి మంచి అవకాశాలను సొంతం చేసుకోవాలని కోరారు. ఈ నిధులను తిరిగి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్టు మంత్రి చెప్పారు. ఇది వృద్ధికి ఊతమిస్తుందన్నారు. జాతీయ అస్సెట్ మానిటైజేషన్ (ఆస్తులపై ఆదాయం రాబట్టుకోవడం) పైప్‌లైన్ మౌలిక సదుపాయాల రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే మంచి కార్యక్రమంగా మంత్రి అభివర్ణించారు. ప్రభుత్వం నూతన డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ)ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం దీనికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తన వాటాగా రూ.20,000 కోట్లను సమకూర్చనుంది. ఐదేళ్లలో దీని ద్వారా రూ.5 లక్షల కోట్ల రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేక ఈ హైవే ఢిల్లీ– ముంబై మధ్యనున్న 1,300 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ రహదారి పొడవునా ప్రత్యేకంగా ఈ–హైవేను నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ–హైవేపై బస్సులు, ట్రక్కులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుంటుందన్నారు. దీనివల్ల రవాణా వ్యయం 70 శాతం తగ్గుతుందని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా మంత్రి తెలిపారు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. -
తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
-
వారు 3 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటున్నారట...!
సాక్షి, న్యూఢిల్లీ : ఫోన్లో మాట్లాడుతూ, మెసేజ్‌లు చేస్తూ వాహనాలు నడిపే వారు ప్రమాదాలను గుర్తించడానికి, అడ్డంకులను దాటడానికి 204 శాతం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు ఒక ఐఐటీ బాంబే పరిశీలనలో తేలింది. దేశంలో జరిగే ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ చూస్తూ వాహనాలు నడపడం. 2016 సంవత్సరానికి గాను రోడ్డు ప్రమాదాల బారిన పడి 2,138 మంది మరణించినట్లు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం ఈ ప్రమాదాలకు కారణాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఐఐటీ-బీ విద్యార్థులు వారి ఇనిస్టిట్యూట్ ఓ పరిశోధనను నిర్వహించారు. మూడు రకాల వయసులకు చెందిన 100 మంది లైసెన్స్ కలిగిన డ్రైవర్లను తమ పరిశోధన కోసం ఎన్నుకున్నారు. అనంతరం ఆ డ్రైవర్లందరిని ఐదు దశలల్లో దాదాపు 3.5 కి.మీ దూరం ప్రయాణం చేయించారు. మార్గమధ్యలో కొన్ని అడ్డంకులను ఏర్పాటు చేశారు. ఆగి వున్న వాహనం, ప్రమాదకరమైన మలుపులు వంటి వాటిని ఉంచారు. కొందరికి ఫోన్లు ఇచ్చి మాట్లాడుతూ వాహనం నడపమని చెప్పగా, మరికొందరిని మామాలుగా వాహనాలను నడపమని చెప్పారు. ఈ పరిశీలనలో అడ్డంకుల వచ్చిన సమయంలో వాటిని గమనించడానికి మాములుగా వాహనాలు నడుపుతున్న వారికంటే ఫోన్ వాడుతూ వాహనం నడుపుతున్నవారు 204 శాతం ఎక్కువ సమయాన్ని తీసుకున్నట్లు విద్యార్థులు గుర్తించారు. ఫోన్ వాడుతున్నవారిలో ఒక రకమైన బద్ధకం ఏర్పడి వారు తమ చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోక పోవడమే ఇలా జరగడానికి ప్రధాన కారణం. వారి దృష్టి అంతా ఫోన్ మీదనే ఉండటంతో ప్రమాదాలను, ముందస్తు హెచ్చరికలను గమనించడానికి మిగితా వారితో పోల్చినప్పుడు ఫోన్ మాట్లాడేవారు అధిక సమయాన్ని తీసుకుంటున్నారని తేలింది. -
నంబర్ ప్లేట్స్ వివాదానికి తెరదించిన కేసీఆర్!
హైదరాబాద్: తెలంగాణలో మోటార్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు వివాదానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెరదించారు. వాహన నంబర్ ప్లేట్ల అంశంపై రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో వాహనాల నంబర్లు నంబర్ ప్లేట్లు మార్చాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. AP స్థానంలో TSగా మార్చుకుంటే సరిపోతుందని కేసీఆర్ తెలిపారు. వాహనాల నంబర్లు పాతవే ఉంటాయని, జిల్లా కోడ్ మాత్రమే మారుతుందని కేసీఆర్ అన్నారు. వాహనాల నెంబర్ ప్లేట్లపై రవాణాశాఖ మంత్రికి సరిగ్గా వివరించలేకపోవడంవల్లే సమస్య వచ్చిందని సమీక్షా సమావేశంలో అధికారులతో కేసీఆర్ అన్నట్టు తెలిసింది.