breaking news
trasfers
-
ఏపీలో IASల బదిలీలు..
-
డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘డియర్ బ్రదర్స్... మీ నోట్ ఫైల్ అయిపోయింది. మేడమ్ (రీజనల్ డైరెక్టర్) సంతకం కోసం పెండింగ్‌లో ఉన్న సంగతి మీకందరికీ తెలిసినదే. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏఎంఓ (అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్)ల ఫైల్ కూడా రెడీ అయిపోయింది. వారికి ఎస్‌ఆర్‌లు కాల్‌ఫర్ చేస్తున్నారు. వాళ్లది అయిన (ప్రమోషన్లు ఇచ్చిన) తర్వాత పెడితే బాగుంటుందని కొంతమంది బ్రదర్స్ కాల్ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఇప్పుడీ పదహారు (16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ప్రమోషన్)కూ కాల్‌ఫర్ చేయించేయాలా? ఏఎంఓలు అయిన తర్వాత ఐదు ఖాళీలైతే అప్పుడు పెట్టించుకుంటారా? పది మంది అలా అడుగుతున్నారు. పది మంది ఇలా చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడైతే బాగుంటుంది. ఏదో ఒకటి చెబితే ఈరోజు పెట్టించేయాలా (సంతకం)? ఆపాలా? అనేది నేను డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాని కోసమే వెయింటింగ్ ఇక్కడ...’ ఇదీ విశాఖలోని కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఓ హెల్త్ విజిటర్ (హెచ్వీ) వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లకు పంపిన వాయిస్ మెయిల్. వారికే కాదు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు అదే తరహాలో సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే రూ.15 వేలు ఫార్మాల్టీ ఇస్తే వారికి ప్రమోషన్‌తో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ కూడా ఇప్పిస్తామని! ఈ డబుల్ ధమాకా ఆఫర్‌తో ఆకర్షితులైన చాలామంది ఆ శాఖ ఉద్యోగులు పైకం సమర్పించుకున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్నా దిగువస్థాయిలో మాత్రం ఆయన ఆశయానికి కొంతమంది గండికొడుతున్నారు. జోన్–1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పాటైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ప్రమోషన్ల ఫైళ్లు కూడా కదిలాయి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్ఎం)లుగా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్)/హెల్త్ విజిటర్ (హెచ్వీ)లుగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో)లుగా ప్రమోషన్ ఇస్తారు. వారిలో ఎవరైనా బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ–బీజడ్సీ) డిగ్రీ ఉన్నవారైతే అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ (ఏఎంవో)గా నియమించవచ్చు. ఈ ప్రమోషన్ల జాబితాలన్నింటికీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఓ ఉద్యోగిని చక్రం... జాబితాలో పేరుంది. రూ.15 వేలే కదా ఫార్మాల్టీ ఇచ్చేస్తే ప్రమోషన్‌కు ప్రమోషన్... తర్వాత కోరుకున్న చోటుకు పోస్టింగ్ వస్తుందని చెబుతూ కొంతమంది ఉద్యోగులే వసూళ్లపర్వానికి తెరలేపారు. గతంలో విజయనగరం జిల్లా బొద్దాం పీహెచ్సీలో పనిచేసి ప్రస్తుతం కేజీహెచ్‌లో హెచ్వీ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగిని చక్రం తిప్పుతోందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెబితే ఆర్డీ సంతకం చేయించేస్తానంటూ రికార్డు చేసిన వాయిస్‌ను ఏకంగా వాట్సాప్‌లోనే పోస్టు చేయడం గమనార్హం. అంతేకాదు ఫార్మాల్టీలే ప్రసాదంగా భావించే ఆర్డీ కార్యాలయంలో ఓ ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జాబితాలు వాట్సాప్‌లో చక్కర్లు... జోన్–1లోని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నవారిలో 87 మంది ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లకు ఎంపీహెచ్ఎస్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు జాబితా తయారైంది. వారిలో 45 మంది విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. అలాగే, 16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ఎంపీహెచ్‌ఈవో/ఏఎంవోలుగా పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ జాబితాలు ఇంకా ఆర్డీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సంతకం చేయకుండా ఉన్న జాబితాలు మాత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రమోషన్ కోసం చూస్తున్నవారి వాట్సాప్‌కు అవి చేరాయి. ఫార్మాల్టీలతో పబ్బం... ఫార్మాల్టీ ఇచ్చేస్తే ఎలాంటి పని అయినా అయిపోతుందని ఎర వేస్తూ వైద్యారోగ్య శాఖలో కొంతమంది తోటి ఉద్యోగులే పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొంతమంది జూనియర్ అసిస్టెంట్లను కొత్త జిల్లాలైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు)కు పంపించారు. వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పాడేరు నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడానికి రూ.70 వేలు చొప్పున సమర్పించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, విజయనగరం జిల్లాలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ జాబితా సిద్ధమైంది. రేపో మాపో దానికి ఆమోదముద్ర పడనుంది. అందుకోసం వారు కూడా రూ.15 వేలు చొప్పున ఫార్మాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు ఫైనల్ చేయలేదు అందరి దగ్గరా ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లు మాత్రమే కాల్‌ఫర్ చేశాం. వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఏఎన్ఎంలు కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వసూళ్లు చేసినవారెవ్వరో నాకు చెబితే వారికి వార్నింగ్ ఇస్తా. – డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్డీ, వైద్యారోగ్య శాఖ, విశాఖపట్నం (చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి) -
75,307 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. సోమ వారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 75,307 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి బదిలీల ప్రక్రియకు భారీ స్పందన వచ్చింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా బదిలీకి అర్హులని విద్యా శాఖ సూచించడంతో ఆ మేరకు అర్హత ఉన్న టీచర్లంతా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో వాటి పరిశీలనకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని ఎలా పరిశీలించాలనే అంశంపై విద్యా శాఖ మల్లగుల్లాలు పడుతోంది. సందేహాలపై స్పష్టత కరువు.. బదిలీలకు సంబంధించిన అంశాల్లో ఉపాధ్యాయుల సందేహాలపై విద్యాశాఖ మౌనం ప్రదర్శిస్తోంది. ప్రధానంగా మెడికల్ కేటగిరీకి సంబంధించి కొన్ని రకాల వ్యాధులనే ప్రిఫరెన్షియల్ కోటాలో నమోదు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధాన వ్యాధులను పేర్కొన్నప్పటికీ వాటిని పక్కాగా నిర్దేశించలేదని, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో వ్యాధులను నిర్ధారిస్తే అందరికీ న్యాయం జరిగేదని ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి జి.సదానంద్‌గౌడ్ పేర్కొన్నారు. స్కూళ్ల కేటగిరీ పాయింట్ల కేటాయింపుపై ఉన్న అపోహలు ఇంకా తొలగలేదు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకూ ప్రత్యేక పాయింట్లు ఇచ్చినప్పటికీ.. ఆ నిబంధనలో స్పష్టత లేదని, దీంతో పాత సర్టిఫికెట్లతో ఈ పాయింట్లు పొందుతున్నట్లు పలువురు టీచర్లు ఆరోపిçస్తు న్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని టీచర్లకు బదిలీ ప్రక్రియలో పాయింట్లు ఇస్తుండగా.. వాటిని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, చంద్రప్రకాశ్ డిమాండ్ చేశారు. -
ఐఏఎస్ ల బదిలీలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారి వివరాలు... పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్పీ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా జేడీ అరుణ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గా బెన్ హర్ మహేశ్, ఢిల్లీలో తెలంగాణ భవన్ ఇంఛార్జ్ గా ఎస్.అరవింద్ కుమార్ నియమితులయ్యారు. -
ఏపీ సచివాలయంలో బదిలీల సందడి
-
ఏపీ సచివాలయంలో బదిలీల సందడి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాయంలో బదిలీల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీలు కిటకిటలాడుతున్నాయి. అన్ని శాఖల మంత్రులు బదిలీల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు సచివాలయంలోనే తిష్టవేసి... తమకు అనుకూలమైనవారికి సిఫార్సులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోనూ ఉద్యోగులు, అధికారులను...బదిలీ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖలకే తొలి ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. ఈ నెల 15వ తేదీతో బదిలీల గడువు ముగియనుంది. మరోవైపు జియోట్యాగ్ విధానం కారణంగా గృహనిర్మాణశాఖలో బదిలీలను మంత్రి మృణాళిని నిలిపివేశారు.