Travel Leisure
-
యూఎస్ మార్కెట్లకు బ్యాంకింగ్ దన్ను
బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ సాధించిన పటిష్ట ఫలితాలకుతోడు.. మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడంలో సఫలమవుతున్నట్లు వెలువడిన వార్తలు వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో బుధవారం డోజోన్స్ 228 పాయింట్లు(0.,9 శాతం) పుంజుకుని 26,870 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 29 పాయింట్లు(0.9 శాతం) బలపడి 3,227 వద్ద నిలవగా.. నాస్డాక్ 62 పాయింట్లు(0.6 శాతం) లాభపడి 10,550 వద్ద స్థిరపడింది.వెరసి మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. అంతకుముందు 750 బిలియన్ యూరోల కోవిడ్ రికవరీ ఫండ్‌పై ఆశలతో యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 2 శాతం స్థాయిలో ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్ 1.4-0.5 శాతం మధ్య క్షీణించగా.. థాయ్‌లాండ్, ఇండొనేసియా 0.3 స్థాయిలో బలపడ్డాయి. బ్యాంకింగ్ జోరు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు వెల్లడించడంతో మోడర్నా ఇంక్ షేరు తాజాగా 7 శాతం జంప్‌చేసింది. మంగళవారం సైతం ఈ షేరు 18 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే.క్యూ2లో మొత్తం ఆదాయం రెట్టింపునకు పెరగడంతో బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ 1.5 శాతం బలపడింది. ఈ ప్రభావంతో నేడు ఫలితాలు ప్రకటించనున్న మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా 2 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా.. ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ వెనకడుగు వేయడంతో నాస్డాక్ లాభాలు పరిమితమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రావెల్ జోరు వ్యాక్సిన్ ఆశలకుతోడు లాక్‌డవుల ఎత్తివేత నేపథ్యంలో ఈ నెల నుంచి బిజినెస్ యాక్టివిటీ పుంజుకుంటున్నట్లు ఫెడరల్ రిజర్వ్ బీజ్బుక్ సర్వే అభిప్రాయపడటంతో టూరిజం, ట్రావెల్ సంబంధ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. కార్నివాల్ కార్ప్, రాయల్ కరిబియన్ క్రూయిజెస్, మారియట్ ఇంటర్నేషనల్, విన్ రిసార్ట్స్ 7-21 శాతం మధ్య దూసుకెళ్లాయి. -
ప్రపంచ ఉత్తమ పర్యాటక నగరాలు ఇవే..
ప్రపంచ ఉత్తమ పర్యాటక నగరాల జాబితాలో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ మొదటి స్థానంలో నిలవగా, థాయిలాండ్‌లోని చియాంగ్ మయి రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక నగరాల జాబితాను ప్రముఖ ట్రావెల్ ప్లస్ లీజర్ బుధవారం వెల్లడించింది. తమ రీడర్స్ అభిప్రాయాలకు అనుగుణంగా ట్రావెల్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వే అధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు. 'చార్లెస్టన్ ఓ అద్భుతమైన ప్రాంతం, ప్రపంచ మేటి నగరాల జాబితాలో ముందు రావడం ఊహించిన విషయమే' అని మ్యాగజైన్ ఎడిటర్ నాథన్ లుంప్ తెలిపారు. అందమైన సాగర తీర ప్రాంతం, చారిత్రక కట్టడాలు, ఆప్యాయంగా పలకరించే స్థానికులు, అందరిని ఆకర్షించే సంస్కృతితోపాటూ, రెస్టారెంట్లు, బార్లు, షాప్‌లతో చార్లెస్టన్ ప్రత్యేకంగా నిలిచిందని లుంప్ తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 10 పర్యాటక నగరాలు... 1) చార్లెస్టన్, సౌత్ కరోలినా 2) చియాంగ్ మయి, థాయిలాండ్ 3) సాన్ మిగెల్ డీ అల్లెన్డే, మెక్సికో 4)ఫ్లోరెన్స్, ఇటలీ 5)లుహంగ్ ప్రబంగ్,లావోస్ 6)క్యోటో, జపాన్ 7)న్యూ ఓర్లీన్స్, లూసియానా 8) బార్సిలోనా, స్పెయిన్ 9) సవన్నా, జార్జియా 10) కేప్ టౌన్, దక్షిణాఫ్రికా ప్రాంతాల వారిగా.. కెనడాలో.. టాప్ సిటీ: క్యూబెక్ సిటీ టాప్ ఐలాండ్: వాంకోవర్ ఐలాండ్, బ్రిటీష్ కొలంబియా దక్షిణ అమెరికాలో.. టాప్ సిటీ: సాన్ మిగెల్ డీ అల్లెన్డే, మెక్సికో టాప్ ఐలాండ్: గలాపగోస్ ఐలాండ్స్, ఈక్వెడార్ యూరోప్: టాప్ సిటీ: ఫ్లోరెన్స్, ఇటలీ టాప్ ఐలాండ్: ఇస్చియా, ఇటలీ ఆసియాలో.. టాప్ సిటీ: చియాంగ్ మయి, థాయిలాండ్ టాప్ ఐలాండ్: పలావన్, ఫిలిప్పైన్స్ ఆస్ట్రేలియాలో.. టాప్ సిటీ: సిడ్నీ, ఆస్ట్రేలియా టాప్ ఐలాండ్: వైహెకే ఐలాండ్, న్యూజిలాండ్ ఆఫ్రికాలో... టాప్ సిటీ: కేప్ టౌన్, దక్షిణ ఆఫ్రికా టాప్ ఐలాండ్: సియాచెల్స్