ప్రపంచ ఉత్తమ పర్యాటక నగరాలు ఇవే..
ప్రపంచ ఉత్తమ పర్యాటక నగరాల జాబితాలో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ మొదటి స్థానంలో నిలవగా, థాయిలాండ్లోని చియాంగ్ మయి రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక నగరాల జాబితాను ప్రముఖ ట్రావెల్ ప్లస్ లీజర్ బుధవారం వెల్లడించింది. తమ రీడర్స్ అభిప్రాయాలకు అనుగుణంగా ట్రావెల్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వే అధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు.
'చార్లెస్టన్ ఓ అద్భుతమైన ప్రాంతం, ప్రపంచ మేటి నగరాల జాబితాలో ముందు రావడం ఊహించిన విషయమే' అని మ్యాగజైన్ ఎడిటర్ నాథన్ లుంప్ తెలిపారు. అందమైన సాగర తీర ప్రాంతం, చారిత్రక కట్టడాలు, ఆప్యాయంగా పలకరించే స్థానికులు, అందరిని ఆకర్షించే సంస్కృతితోపాటూ, రెస్టారెంట్లు, బార్లు, షాప్లతో చార్లెస్టన్ ప్రత్యేకంగా నిలిచిందని లుంప్ తెలిపారు.
ప్రపంచంలోనే టాప్ 10 పర్యాటక నగరాలు...
1) చార్లెస్టన్, సౌత్ కరోలినా
2) చియాంగ్ మయి, థాయిలాండ్
3) సాన్ మిగెల్ డీ అల్లెన్డే, మెక్సికో
4)ఫ్లోరెన్స్, ఇటలీ
5)లుహంగ్ ప్రబంగ్,లావోస్
6)క్యోటో, జపాన్
7)న్యూ ఓర్లీన్స్, లూసియానా
8) బార్సిలోనా, స్పెయిన్
9) సవన్నా, జార్జియా
10) కేప్ టౌన్, దక్షిణాఫ్రికా
ప్రాంతాల వారిగా..
కెనడాలో..
టాప్ సిటీ: క్యూబెక్ సిటీ
టాప్ ఐలాండ్: వాంకోవర్ ఐలాండ్, బ్రిటీష్ కొలంబియా
దక్షిణ అమెరికాలో..
టాప్ సిటీ: సాన్ మిగెల్ డీ అల్లెన్డే, మెక్సికో
టాప్ ఐలాండ్: గలాపగోస్ ఐలాండ్స్, ఈక్వెడార్
యూరోప్:
టాప్ సిటీ: ఫ్లోరెన్స్, ఇటలీ
టాప్ ఐలాండ్: ఇస్చియా, ఇటలీ
ఆసియాలో..
టాప్ సిటీ: చియాంగ్ మయి, థాయిలాండ్
టాప్ ఐలాండ్: పలావన్, ఫిలిప్పైన్స్
ఆస్ట్రేలియాలో..
టాప్ సిటీ: సిడ్నీ, ఆస్ట్రేలియా
టాప్ ఐలాండ్: వైహెకే ఐలాండ్, న్యూజిలాండ్
ఆఫ్రికాలో...
టాప్ సిటీ: కేప్ టౌన్, దక్షిణ ఆఫ్రికా
టాప్ ఐలాండ్: సియాచెల్స్