‘మీకు టికెట్ ఇస్తారో లేదో చూసుకోండి’
విజయవాడ: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసే అర్హత ఎంపీ కేశినేని నానికి లేదని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ట్రావెల్స్ సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టిన ఘనుడు కేశినేని అని ఆయన అన్నారు.
బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ గురించి కాదు.. ముందు మీకు టీడీపీ టికెట్ ఇస్తారో లేదో చూసుకోండి. నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి స్వప్రయోజనాల కోసం కేశినేని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.