నకిలీ నక్సలైట్ల అరెస్టు
ఆల్కాట్‌తోట(రాజమండ్రి), న్యూస్‌లైన్ : నగరాల్లో ప్రముఖ వ్యక్తులను నక్సలైట్లమని బెదిరించి, లక్షల రూపాయలను వసూలు చేసిన, పాత నేరస్తులైన ముగ్గురు నకిలీ నక్సలైట్లను రాజమండ్రి అర్బన్‌జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, 4 సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, రూ.2.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతానికి చెంది న పాత నేరస్తుడు మొహమ్మద్ రఫీవుద్దీన్ అలియా స్ జాకిర్, అతడి రెండో భార్య జమీదున్నీసాబేగం అలియాస్ షకీలా సోహానీ తాము నక్సలైట్లమని ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేస్తుం టారు. ఇంటర్ చదివిన జాకిర్ 1993 నుంచి 1999 వరకు గల్ఫ్, రియాద్, 2001 నుంచి దుబాయ్‌లోను పనిచేశాడు. 2006-07లో కరీంనగర్ జిల్లాలో హా ర్వెస్ట్ ట్రాక్టర్ కొని, వ్యవసాయ పనులకు అద్దెకివ్వడంతో నష్టం వచ్చింది. తన సహచరులతో కలిసి నక్సలైట్లుగా బెదిరించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. ఇందుకు డాక్టర్లు, వ్యాపారులు, సంపన్నుల ఫోన్ నంబర్లు సేకరించారు. నకిలీ అడ్రస్సులతో సిమ్‌కార్డులు తీసుకున్నారు.
2008 నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ సిటీ, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేశారు. కొన్ని కేసుల్లో పట్టుబడి జైలుకు కూడా వెళ్లారు. మరో నిందితుడు మొహమ్మద్ అన్వర్‌షరీఫ్ మాత్రం కాబోయే అల్లుడు కావడంతో మొదటిసారిగా వీరితో కలి శాడు. ఈ నెల 16న రాజమండ్రికి చెందిన బిల్డర్ మన్యం ఫణికుమార్‌కు జాకిర్, షకీలా సోహానీ, అన్వర్‌షరీఫ్ కలిసి సుదర్శన్ పేరుతో ఫోన్ చేశారు. నక్సలైట్లమని చెప్పి.. పేలుడు పదార్థాలు కావాలని అతడిని బెదిరించారు. లేనిపక్షంలో రూ.రెండు లక్ష లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఫణికుమార్ రూ.60 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వారి సూచన మేరకు లాలాచెరువు-ఆటోనగర్ మధ్య ఓ ప్రదేశంలో ఆ నగదు పెట్టాడు. రాజమండ్రిలోని ఓ కార్డియాలజిస్ట్ వద్ద రూ.లక్ష, కాకినాడలోని రాచూరి రాఘవేంద్రరావు అనే వ్యక్తి ని బెదిరించి రూ.70 వేలు, విశాఖపట్నంలోని డాక్టర్ కామేశ్వరరావును బెదిరించి రూ.లక్ష కాజేశారు. విశాఖపట్నంలోనే మరో ముగ్గురిని బెదిరించారు. నింది తులు ఈ నెల 17న రాత్రి తునిలో బస చేసి, 18న ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు. విజయవాడ వరకు వెళ్లిన తర్వాత రాజమండ్రికి చెందిన బి ల్డర్ ఫణికుమార్‌కు ఫోన్ చేశారు. రూ.రెండు లక్షలు అడిగితే రూ.60 వేలే ఇచ్చావని, మిగిలిన సొమ్ము ఇవ్వాలని బెదిరించారు. దీంతో రూ.40 వేలు ఇచ్చేందుకు ఫణికుమార్ ఒప్పుకున్నాడు. ఈ క్రమం లో నిందితులు రాజమండ్రి వచ్చారు.
ఈ మేరకు ఫణికుమార్ స్థానిక ప్రకాష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు కేసు నమోదు చేశారు. అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్ మూర్తి పర్యవేక్షణలో క్రైం డీఎస్పీ పి.ఉమాపతివర్మ, తూర్పు మండల డీఎస్పీ ఆర్.సత్యానందం,ప్రకాష్‌నగర్, కడియం,క్రైం ఇన్స్పెక్టర్లు సుబ్బారావు, కె.వరప్రసాద్, జి.కెనెడీ, ఎస్.గంగరాజు వలపన్నారు. రూ.40 వేలు తీసుకునేందుకు రావాలని ఫణికుమార్ చెప్పగా, ఆటోనగర్-లాలాచెరువుల మధ్య డబ్బు పెట్టాలని జాకిర్ సూచించాడు. నిందితులు కారులో దివాన్‌చెరువు రోడ్డులోకి రాగానే, పోలీసులను గమనించి కోరుకొండలోని ఖాళీ ప్రదేశంలో కారు విడిచి పరారయ్యారు. ఆదివారం రాజమండ్రిలోని ఓ వైద్యుడిని బెదిరించేందుకు వచ్చిన ముగ్గురు నిందితులను ప్రకాష్‌నగర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు అరెస్టు చేశారు. వీరు విడిచిపెట్టిన కారులో రూ.2.70 లక్షలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ రవికుమార్ మూర్తి రివార్డులు ప్రకటిం చారు.