నల్లమలకు సోలార్ వెలుగులు
* 16 సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా
* 10గంటల్లో 5 మెగావాట్ల విద్యుదుత్పత్తి
* ట్రయల్న్ సక్సెస్
అచ్చంపేట రూరల్ : నల్లమలకు వారం రోజుల్లో సోలార్ వెలుగులు రాబోతున్నాయి. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామ శి వారులో సుమారు 30కోట్లతో దాదాపు 24 ఎకరాల్లో ప్రభుత్వం చేపడుతున్న పనులు పూర్తికావచ్చాయి. చిన్నచిన్న పనులు పూర్తయి వారంపదిరోజుల్లో ప్లాంట్ అందుబాటులోకి రానుంది. సోలార్ ప్లాంట్ నుంచి సౌరశక్తిని ఉపయోగించి సూర్యోదయం నుంచి సూ ర్యాస్థమయం వరకు 10 గంటల్లో రోజు కు 5 మెగావాట్ల విద్యుత్‌ను తయారుచేసే సామర్థ్యంగల యంత్రాలను అమర్చారు. నియోజకవర్గంలోని 16 సబ్‌ష్టేషన్లఅను అనుసందానం చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంతో పాటు మండలంలోని పరిసరగ్రామాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా కానుంది.
పనులు ఇలా..
నియోజకవర్గంలో లోఓల్టేజీతోపాటు విద్యుత్ కోతలు అధికంగా ఉండటంతో ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను అందుబాటులో ఉంచడానికి సంకల్పించింది. మండలంలోని లక్ష్మాపూర్, నడింపల్లి, ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామాలకు ప్లాంట్లను మంజూరు చేసిం ది. ఒక్కోప్లాంట్‌కు దాదాపు 30 కోట్ల వరకు వ్యయం అంచనావేసి ముంబైకి చెందిన ఎస్ఎల్ మైనింగ్ కంపెనీకి పనులను అప్పగించింది. వారికిచ్చిన గడువు ప్రకారం ఈ ప్లాంట్లు గతనెల 30వ తేదీనాటికే వినియోగంలోకి తేవాల్సి ఉండగా పనులు సకాలంలో జరుగకపోవడం, యంత్రాలు రాకపోవడంతో మరో వారం పట్టవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
24గంటల విద్యుత్
పనులు పూర్తయితే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి రోజు నిరంతరాయం గా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉం టుందని ట్రాన్స్‌కో ఏడీ ఈ తావుర్యానాయక్ తెలిపారు.16 సబ్స్టేషన్ల పరిధిలో సోలార్‌ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. లక్ష్మాపూర్ గ్రామశివారులోని ప్లాంట్ పనులు పూర్తవగా, నడింపల్లిలో మరో ప్లాంట్ ఏర్పాటుకు స్థలం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని, అలాగే ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో స్థలం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఈ పనులు సైతం సకాలంలో పూర్తయితే నియోజకవర్గంలో విద్యుత్ సమస్య శాశ్వతంగా తీరుతుంది. మూడు రోజుల కిందట చేసిన ట్రయల్న్ ్రకూడా సక్సెస్‌కావడంతో అధికారికంగా పనులు ప్రారంభించాల్సి ఉంది.