treasury funds
-
ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. జీహెచ్ఎంసీ పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. జీహెచ్ఎంసీలోని స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెరగడం వల్ల వారికి సంతోషం కలిగినప్పటికీ, అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీకి కొంత భారం పెరగనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ కాక, 148 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇంకా జరగకపోవడంతో వారు లేరు. ప్రస్తుతం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటే మేయర్ గౌరవ వేతనం ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. 65 వేలకు పెరిగింది. డిప్యూట్ మేయర్‌కు రూ.25 వేల నుంచి రూ.32,500, కార్పొరేటర్లకు రూ.6 వేల నుంచి రూ.7,800 లకు పెరిగింది.పెంపును పరిగణనలోకి తీసుకుంటే కింది విధంగా బల్దియాపై అదనపు భారం పడుతుంది. ఈ పెంపుతో మొత్తం బల్దియా ఖజానాపై ఏడాదికి రూ.34,66,800 భారం పెరిగింది. చదవండి: నచ్చిన సబ్జెక్టు.. మెచ్చిన చోట -
యూఎస్ బాండ్లలో ఇన్వెస్ట్మెంట్స్ జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో యూఎస్ ప్రభుత్వ సెక్యూరిటీలలో దేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. 20 బిలియన్ డాలర్లు(రూ. 1.48 లక్షల కోట్లు) ఎగసి 220 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ఇక గతేడాది జూన్‌తో పోలిస్తే యూఎస్ ట్రెజరీ సెక్యూరిటీస్‌లో దేశీ పెట్టుబడులు దాదాపు 37 బిలియన్ డాలర్లమేర జంప్‌చేశాయి. తద్వారా యూఎస్ ట్రెజరీ పెట్టుబడులు అధికంగా దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. 1.277 లక్షల కోట్ల డాలర్లతో జపాన్ టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. మార్చికల్లా 200 బిలియన్ డాలర్లకు చేరిన దేశీ పెట్టుబడులు ఏప్రిల్‌లో 208.7 బిలియన్ డాలర్లకు చేరగా.. మే నెలకల్లా 215.8 బిలియన్ డాలర్లను తాకాయి. ఈ బాటలో జూన్ చివరికి 220 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించాయి. గతేడాది జూన్‌కల్లా ఇవి 182.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. ఓవైపు యూఎస్ ట్రెజరీ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. ఈ నెల రెండో వారానికల్లా రిజర్వ్ బ్యాంక్ వద్ద గల ఫారెక్స్ నిల్వలు 621 బిలియన్ డాలర్లను దాటడం ద్వారా సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాకడం విశేషం! -
‘కోర్టు ధిక్కరణ’ నిధులపై తెలంగాణ హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం ఖర్చుల కోసం కేటాయించిన నిధులపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రూ.58 కోట్లు మంజూరుపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు మంజూరు చేయడమేమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని హైకోర్టు రెవెన్యూ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశించింది. ఈ సందర్భంగా సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. -
ఖజానా ఖాళీ.. దహన సంస్కారాలకూ డబ్బుల్లేవ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ఖజానా నిండుకుంది. ఉద్యోగులు తమ జీతంలో నుంచి ప్రతినెలా దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)తో పాటు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం ఇచ్చే డబ్బులకూ చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ నెల 6వ తేదీ నుంచి బిల్లుల మంజూరుకు ఆర్థిక శాఖ బ్రేకులు వేసింది. ఒక్కపైసా కూడా చెల్లించవద్దంటూ రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఫలితంగా నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఉద్యోగుల పీఎఫ్‌తో పాటు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ట్రెజరీ నుంచి కూడా బిల్లులను బ్యాంకులకు పంపుతున్నారు. బిల్లు మంజూరు కోసం ఖజానా నుంచి విత్‌డ్రా చేసేందుకు క్లిక్ చేస్తే.... ఓవర్ డ్రాఫ్టు (ఓడీ) అని చూపిస్తోంది. అంటే ఖజానాలో పైసా కూడా నిధులు లేవన్నమాట. ఒకవేళ బిల్లులు మంజూరు చేయాలంటే ఆర్థిక పరిమితికి మించి అప్పు తీసుకోవాల్సి రానుంది. ఇందుకు రిజర్వ్‌బ్యాంకు (ఆర్బీఐ) అనుమతించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఖజానాకు వివిధ మార్గాల్లో అంటే ఎక్సైజ్, పన్నులు, రవాణా రంగాల నుంచి ఆదాయం జమ అయితేనే బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఆంక్షల వల్ల కేవలం కర్నూలు జిల్లాలోనే రూ.100 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ మొత్తం రూ.2,500 కోట్ల మేరకు ఉంటుందని ట్రెజరీ వర్గాలు పేర్కొంటున్నాయి. దహన సంస్కారాలకూ డబ్బుల్లేవ్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగెర ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేసే కవిత ఈ ఏడాది అక్టోబరు 21వతేదీన మరణించారు. కుటుంబ సభ్యులు ఆమె దహన సంస్కార ఖర్చుల కోసం మరణ ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి డిసెంబరు 5వ తేదీన అందచేసినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. అదేమంటే ఆంక్షలు విధించారంటూ ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే కాదు.. వివాహాలు, ఇతర అత్యవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు మంజూరు కాకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. నీరు–చెట్టుకు నేరుగా నిధులు వాస్తవానికి అన్ని బిల్లులు ఆన్లైన్లోనే మంజూరు చేసేందుకు అనుగుణంగా సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం–సీఎఫ్ఎంఎస్)ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. బిల్లులను క్రమపద్ధతిలో ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్లైన్లో మంజూరు చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా నీరు–చెట్టు బిల్లులను సీఎఫ్ఎంఎస్ విధానంలో కాకుండా ప్రభుత్వం నేరుగా విడుదల చేసింది. ఇప్పుడు కూడా బడా కాంట్రాక్టర్లకు అలాగే బిల్లులు నేరుగా చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. -
నిలిచిన రూ.100 కోట్లు !
జిల్లాలో ఖజానా కార్యాలయం నుంచి డ్రాయింగ్ ఆఫీసర్స్ ఖాతాల్లో పడాల్సిన దాదాపు రూ.100 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నుంచి ట్రెజరీలో ప్రవేశపెట్టిన కంప్రెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, మెడికల్, న్యాయ విభాగం, ఎల్ఐసీతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి రావాల్సిన డబ్బులు నిలిచిపోయాయి. దీంతో వారు ఆందోళనలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టూటౌన్ : ప్రభుత్వం ట్రెజరీలో కొత్తగా ప్రవేశపెట్టిన సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం) సాంకేతిక సమస్యల (సాఫ్ట్వేర్ సమస్యలు) చిక్కు వీడలేదు. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న నూతన విధానంపై (సీఎఫ్ఎంఎస్) సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానంలోకి అనేక శాఖల ఉద్యోగుల్ని చేర్చడంలో సాఫ్ట్వేర్ సమస్యలు ఉండటంతో నూతన విధానం ముందుకు సాగడం లేదు. దీంతో జిల్లాలో వందలాది మంది ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎయిడెడ్ స్కూలు ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్ శాఖల్లో పనిచేసే వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు ఇలా చాలామంది చిరుద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాని పరిస్థితి నెలకొంది. వీరితో పాటు పంచాయతీల నిధులు, మండల పరిషత్ నిధులు, జిల్లా పరిషత్‌కు సంబంధించిన నిధులు, ఇతర అభివృద్ధి పథకాలకు నిధులు ఇలా అన్నీ వరుసగా బ్రేక్ అయ్యాయి. ఈ శాఖలకు సంబంధించిన పీడీ అకౌంట్ (పబ్లిక్ అకౌంట్ పోర్టల్)లోకి చెక్కుల పర్మిషన్ నిలిచిపోవడంతో నిధులు డ్రా చేసే పరిస్థితి లేకుండా పోయింది. చనిపోయిన ఉద్యోగులు, పెన్షనర్స్, ఎంప్లాయిస్‌కు సంబంధించిన మట్టి ఖర్చులు, పెన్షన్ బకాయిలు రాలేదు. మార్చి నెలలో జీతాల బిల్లులు సకాలంలో పెట్టుకోని ఉద్యోగులకు నేటికీ జీతాలు రాని స్థితి ఉంది. దాదాపు 182 ప్రభుత్వ శాఖల వరకు ఉండగా వాటిలో ఇప్పటి వరకు కేవలం 95 శాఖలకే ఆయా శాఖాధిపతుల నుంచి ఉద్యోగుల డేటా కన్ఫ్ర్మేషన్ చేయడం (సీఎఫ్ఎంఎస్ విధానంలో)కోసం అనుమతి లభించిందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. సీఎఫ్ఎంఎస్ విధానంపై డ్రాయింగ్ ఆఫీసర్లకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ఇప్పటి వరకు ఏ బిల్లుకూ మోక్షం లభించడం లేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి: జిల్లాలో మొత్తం 12 ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి. అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, మార్టూరు, ఒంగోలు, పొదిలి, యర్రగొండపాలెంలో సబ్ ట్రెజరీలు ఉన్నాయి. మొత్తం 37,647 మంది ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరు గాక ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతుంటారు. ప్రతి నెల రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. సబ్ ట్రెజరీ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వివిధ రకాల బిల్లులు వస్తుంటాయి. ఆయా బిల్లులకు కేటాయించిన సమయంలో బిల్లులను ఆన్లైన్లో నమోదు చేసి బ్యాంకులకు ట్రెజరీ ఉద్యోగులు పంపించి, జీతాలు విడుదల చేసి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటుంది. నిలిచిన నిధులు ప్రస్తుతం ఏప్రిల్ నుంచి ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎంఎఫ్ఎస్)పై జిల్లాలోని డ్రాయింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆయా శాఖల ఉన్నతాధికారులు (హెచ్వోడీలు) నుంచి చాలా శాఖలకు అనుమతులు రాకపోవడం, సాంకేతిక సమస్యలు ఇలా పలు కారణాల వల్ల జిల్లాలో ఎంతో మంది ఉద్యోగులు, పెన్షనర్స్ 20 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధులు కూడా నిలిచిపోయాయి. ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు: నిత్యం ఎంతో మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పటికీ జీతాలు రాక ట్రెజరీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా వివిధ రకాల నిధులు నిలిచిపోయినట్లు సమాచారం. ఏప్రిల్‌కు ముందు ట్రెజరీపై ఆంక్షలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు, ఇప్పుడు కొత్త విధానం అమలులో సాఫ్ట్వేర్ సమస్యలతో సీఎఫ్ఎంఎస్లోకి చేర్చక పోవడంతో జీతాలు పొందలేని పరిస్థితి నెలకొందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. రెండు నెలలుగా జీతాలు రావాలి జిల్లాలో 240 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. 960 మంది పనిచేస్తున్నారు. రెండునెలలుగా జీతాలు రావాలి. మార్చి నెల జీతం రాలేదు. ఏప్రెల్ నుంచి సీఎఫ్ఎంఎస్ విధానం వచ్చిన తరువాత ఈ నెల జీతం రాలేదు. ఇప్పటి వరకు కొత్త విధానంలోకి మా టీచర్స్ పేర్లు మారలేదు. దీంతో రెండు నెలల జీతాలు ఆగిపోయాయి. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం సాంకేతిక సమస్యలు పరిష్కరించి త్వరితగతిన జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – ప్రభాకర్‌రెడ్డి, ఏపీ టీచర్స్ గిల్డ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాఫ్ట్వేర్ సమస్య వల్లనే కొంత జాప్యం 182 డిపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 95 డిపార్టుమెంట్స్కే హెచ్‌వోడీల నుంచి పర్మిషన్ వచ్చింది. మిగిలిన శాఖలకు ఆయా శాఖల హెచ్వోడీలు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ వచ్చిన తరువాత పాస్వర్డ్ వస్తోంది. అప్పుడు ఆయా శాఖల ఉద్యోగుల డేటా సీఎప్ఎంఎస్ పద్ధతిలోకి మార్చాలి. సాఫ్ట్వేర్ సమస్యలు ఉండటం వలన కొంత జాప్యం జరుగుతోంది. కొద్ది రోజులలో సమస్య పరిష్కరమవుతుంది. – నారాయణ, ట్రెజరీ ఉద్యోగి -
ఎస్బీహెచ్లో రూ. 2.65 కోట్లు మాయం
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్ బీహెచ్) బ్యాంకులో రూ.2.65 కోట్లు మాయమయ్యాయి. కాగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగే డబ్బును దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు. బ్యాంకు మేనజర్ సత్యానందం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు పరిధిలో ట్రెజరీ ద్వారా నిర్వహించే నిధులు, లావాదేవీలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఆర్ధిక కార్యకలాపాలన్నీ ప్రత్తిపాడు ఎస్ బీహెచ్ ద్వారానే జరుగుతాయి. అయితే ఈ లావాదేవీల్లో పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లినట్లు ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకూ నిర్వహించిన లెక్కల్లో తేలిందని చెప్పారు. దీంతో ట్రెజరీ, ఇతరత్రా బ్యాంకు కార్యకలాపాల్లో చురుకుగా ఉండే బ్యాంకు సబ్ స్టాఫర్ ఎడ్ల ఉషా సత్య సూర్య వెంకట రాకేష్ అలియాస్ చిన్నాపై అనుమానం వచ్చినట్లు తెలిపారు. అతని అకౌంట్ లావాదేవీలను పరిశీలించి చూడగా రూ.2.65కోట్లను బినామీల ఖాతాలకు దారి మళ్లించినట్లు తేలిందని చెప్పారు. అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో 29 బినామీ ఖాతాలు తెరిచినట్లు పేర్కొన్నారు. వాటిలోకి డబ్బును జమ చేసినట్లు చెప్పారు. ఒక్కో ఖాతాకు లక్ష రూపాయలకు పైనే జమ చేసినట్లు తెలిపారు. కాగా దారి మళ్లించిన సొమ్మును వెనక్కు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ రూ.1.38కోట్ల నిధులు వెనక్కురాబట్టుకున్నట్లు పేర్కొన్నారు. ట్రెజరీస్ డీడీ విచారణ నిధుల గోల్మాల్ వ్యవహారంలో ట్రెజరీ ఉద్యోగుల పాత్రపై ట్రెజరీ జిల్లా స్ధాయి అధికారి డీడీ భోగారావు శుక్రవారం విచారణ జరిపారు. స్థానిక సబ్ ట్రెజరీలోని ఖాతాలను, సబ్ ట్రెజరీ ద్వారా బ్యాంక్‌లో జరిగిన లావాదేవీలను లోతుగా పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్‌ను కలిసి ఖాతాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. సబ్ ట్రెజరీ నిధుల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదని చెప్పారు. సబ్ ట్రెజరీ నిధులు, వోచర్లు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆయన వెంట సబ్ ట్రెజరీ అధికారులు జగదీశ్వరి, సోమయాజులు, జహిరుద్దీన్ తదితరులున్నారు.