చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కొవ్వూరు : కొవ్వూరు మండలం కుమారదేవం నుం చి ఈనెల 9న మోటారు సైకిల్ వస్తున్న పోనుకుమాటి రామచంద్రరావు అనే వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన రామచంద్రరావు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు పట్టణ పోలీ సు లు తెలిపారు. ఆరికిరేవుల గ్రామానికి చెందిన రా మచంద్రరావు కుమారదేవంలో మాంస దుకాణం నిర్వహిస్తున్నాడు. వ్యాపారం ముగించుకుని వస్తుం డగా ఆటో ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యాడు.