చికిత్స పొందుతూ మృత్యుఒడికి..
రొద్దం : మండలంలోని కంచిసముద్రంలో బోయ లక్ష్మీ(25) అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు రొద్దం ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి ఈ నెల 14న లక్ష్మీపై కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె చివరకు కోలుకోలేక మృతి చెందిందన్నారు. మృతురాలికి భర్త సహా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.