breaking news
Tri-series final
-
జయం మనదే
కొలంబో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా అవతరించింది. ఆతిథ్య శ్రీలంక జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గత మ్యాచ్‌లో ఫిఫ్టీతో ఫామ్‌లోకి వచి్చన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తుదిపోరులో వీరోచిత శతకంతో భారత్‌కు ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీస్కోరు చేసింది. వైస్ కెప్టేన్ స్మృతి మంధాన (101 బంతుల్లో 116; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... హర్లీన్ డియోల్ (56 బంతుల్లో 47; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టేన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. కెప్టేన్ చమరి ఆటపట్టు (66 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్), నీలాక్షిక సిల్వా (58 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో స్పిన్నర్ స్నేహ్ రాణా 4, పేసర్ అమన్‌జ్యోత్ కౌర్ 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో 15 వికెట్లు తీసిన స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. సూపర్ స్మృతి... ఓపెనర్లు స్మృతి, ప్రతీక రావల్ (30; 2 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 70 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. తర్వాత హర్లీన్ జతయ్యాక 55 బంతుల్లో స్మృతి అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఇద్దరు నిలదొక్కుకోవడంతో 22వ ఓవర్లో భారత్ 100 పరుగులకు చేరింది. మరోవైపు లంక శిబిరం ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలయ్యాయి. చమరి వేసిన 31వ ఓవర్లో వరుసగా 4, 4, 4, 4లతో స్మృతి వన్డేల్లో 11వ సెంచరీని 92 బంతుల్లో పూర్తి చేసుకుంది. కాసేపటికి జట్టు స్కోరు 190 వద్ద ఆమె ని్రష్కమించింది. తర్వాత వచి్చన హర్మన్‌ప్రీత్, జెమీమాలు కూడా లంక బౌలర్లపై యథేచ్చగా పరుగులు సాధించడంతో భారత్ స్కోరు దూసుకెళ్లింది. ముఖ్యంగా జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టడంతో భారత జట్టు చివరి 10 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆఖర్లో దీప్తి (14 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు), అమన్‌జ్యోత్ (12 బంతుల్లో 18; 2 ఫోర్లు) వేగంగా పరుగులు జతచేశారు. ఆరంభం నుంచే తడబాటు... ఆరంభం నుంచి ఇన్నింగ్స్ ముగిసేదాకా లంక జట్టు ఏ దశలోనూ లక్ష్యఛేదనవైపు నడవ లేదు. మీడియం పేసర్ అమన్‌జ్యోత్ వైవిధ్యమైన బంతులతో లంక ఓపెనర్లను హడలెత్తించింది. ఖాతా తెరువక ముందే హాసిని (0) డకౌట్ కాగా, కాసేపటికి విష్మీ గుణరత్నే (36; 5 ఫోర్లు)ని కూడా అమన్జ్యోతే క్లీన్»ౌల్డ్ చేసింది. కెప్టేన్ చమరి, నీలాక్షిక కాసేపు భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్నారే తప్ప లక్ష్యానికి అవసరమైన వేగాన్ని అందిపుచ్చుకోలేదు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న చమరి 121 స్కోరు వద్ద పెవిలియన్ చేరింది. తర్వాత హర్షిత నిలబడేందుకు ప్రయత్నం చేసినా... స్నేహ్ రాణా, అమన్‌జ్యోత్, శ్రీచరణి చావుదెబ్బ తీశారు. దీంతో 173/2తో పటిష్టంగా కనిపించిన లంక 19 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయి 192/7 వద్ద కుదేలైంది. సుగందిక (27; 5 ఫోర్లు) చేసిన ఆ మాత్రం స్కోరుతో జట్టు 240 పైచిలుకు స్కోరు చేయగలిగింది.భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) వత్సల (బి) ఇనోక 30; స్మృతి (సి) హర్షిత (బి) విహంగ 116; హర్లీన్ (సి అండ్ బి) విహంగ 47; హర్మన్‌ప్రీత్ (సి) మాల్కి మదర (బి) సుగంధిక 41; జెమీమా (సి) నీలాక్షిక (బి) సుగంధిక 44; రిచా ఘోష్ (సి) సబ్–కరుణరత్నే (బి) మాల్కి మదర 8; అమన్‌జ్యోత్ (సి) సబ్–కరుణరత్నే (బి) మాల్కి మదర 18; దీప్తి శర్మ (నాటౌట్) 20; క్రాంతి గౌడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 342. వికెట్ల పతనం: 1–70, 2–190, 3–219, 4–267, 5–294, 6–304, 7–341.బౌలింగ్: మాల్కి మదర 10–0–74–2, దేమి విహంగ 10–0–69–2, సుగంధిక 10–0–59–2, ఇనొక రణవీర 10–0–62–1, చమరి 8–0–61–0, పియుమి వత్సల 2–0–17–0. శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (బి) అమన్‌జ్యోత్ 0; విష్మీ గుణరత్నే (బి) అమన్‌జ్యోత్ 36; చమరి (బి) స్నేహ్ రాణా 51; నీలాక్షిక (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 48; హర్షిత (సి) స్మృతి (బి) అమన్‌జ్యోత్ 26; దేమి విహంగ (సి) స్నేహ్ రాణా (బి) శ్రీ చరణి 4; అనుష్క (సి) అమన్‌జ్యోత్ (బి) స్నేహ్ రాణా 28; వత్సల రనౌట్ 9; సుగంధిక (రనౌట్) 27; మాల్కి మదర (బి) స్నేహ్ రాణా 0; ఇనోక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–0, 2–68, 3–121, 4–173, 5–178, 6–178, 7–192, 8–243, 9–244, 10–245. బౌలింగ్: అమన్‌జ్యోత్ కౌర్ 8–0–54–3, క్రాంతి 5–0–22–0, దీప్తి శర్మ 10–0–43–0, శ్రీచరణి 10–0–55–1, స్నేహ్ రాణా 9.2–1–38–4, ప్రతీక రావల్ 5–0–18–0, హర్లీన్ డియోల్ 1–0–12–0. -
సఫారీలను కుప్పకూల్చారు..
బార్బడోస్: ముక్కోణపు సిరీస్‌లో వెస్టిండీస్ ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డారెన్ బ్రావో (102) సెంచరీతో పాటు బౌలర్లు రాణించడంతో విండీస్ 100 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మరో బంతి మిగిలుండగా 285 పరుగులకు ఆలౌటైంది. బ్రావో సెంచరీతో పాటు పొలార్డ్ (62) హాఫ్ సెంచరీ చేశాడు. హోల్డర్ 40, బ్రాత్‌వైట్ 33 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లు మోరిస్, రబడ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం 286 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు.. విండీస్ బౌలర్ల ధాటికి 185 పరుగులకే కుప్పకూలారు. టాపార్డర్‌లో బెహార్డియన్ (35) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. మోర్నీ మోర్కెల్ 32 (నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ 29, పార్నెల్ 28 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు నరైన్, గాబ్రియెల్ చెరో మూడు, బ్రాత్‌వైట్ రెండు వికెట్లు పడగొట్టారు. -
అజేయ ఆసీస్
బెయిలీ జట్టుకే ముక్కోణపు టోర్నీ టైటిల్ * ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘనవిజయం * మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ షో * రాణించిన మార్ష్, ఫాల్క్‌నర్ పెర్త్: ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావించిన ముక్కోణపు టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (98 బంతుల్లో 95; 15 ఫోర్లు; 4/46) ఆల్‌రౌండ్ షోకు తోడు... మిచెల్ మార్ష్ (68 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), ఫాల్క్‌నర్ (24 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సమయోచితంగా స్పందించడంతో ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన బెయిలీ బృందం అజేయంగా నిలువడంతోపాటు టైటిల్‌ను దక్కించుకుంది. ‘వాకా’ మైదానంలో ఆదివారం జరిగిన ఫైన ల్లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 278 పరుగులు చేసింది. స్మిత్ (50 బంతుల్లో 40; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా... ఫించ్ (0), వార్నర్ (12), బెయిలీ (2) నిరాశపర్చారు. దీంతో ఆసీస్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్, మార్ష్‌లు ఆచితూచి ఆడుతూనే భారీ స్కోరుకు బాటలు వేశారు. 25వ ఓవర్లో జట్టు స్కోరును 100 పరుగులను దాటించిన ఈ జోడి క్రమంగా బ్యాట్ ఝుళిపించింది. బ్యాటింగ్ పవర్‌ప్లేలో వీరిద్దరు 46 పరుగులు రాబట్టడంతో 41వ ఓవర్లో ఆసీస్ స్కోరు 200లకు చేరుకుంది. కానీ దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 141 పరుగులు జతచేశారు. ఓ ఎండ్‌లో సహచరులు వెనుదిరుగుతున్నా... రెండో ఎండ్‌లో ఫాల్క్‌నర్ వీరవిహారం చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లను హడలెత్తిస్తూ చివరి 8 ఓవర్లలో 78 పరుగులు జత చేశాడు. 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ఫాల్క్‌నర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతిని అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 3, అండర్సన్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 39.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. రవి బొపారా (59 బంతుల్లో 33; 1 ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొయిన్ అలీ (26), రూట్ (25), బ్రాడ్ (24) ఓ మోస్తరుగా ఆడారు. నాలుగో ఓవర్లో బెల్ (8) అవుటైన తర్వాత జాన్సన్ 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీశాడు. టేలర్‌తో పాటు వరుస బంతుల్లో అలీ, మోర్గాన్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత బొపారా నిలకడగా ఆడినా... 25వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ వరుస బంతుల్లో బట్లర్ (17), వోక్స్ (0)లను అవుట్ చేశాడు. బ్రాడ్‌తో ఎని మిదో వికెట్‌కు 32; ఫిన్ (6)తో తొమ్మిదో వికెట్‌కు 30 పరుగులు జోడించి బొపారా అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే ఫిన్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 278/8 (50 ఓవర్లలో) (మ్యాక్స్‌వెల్ 95, మార్ష్ 60, ఫాల్క్‌నర్ 50 నాటౌట్; బ్రాడ్ 3/55); ఇంగ్లండ్: 166 ఆలౌట్ (39.1 ఓవర్లలో) (బొపారా 33, జాన్సన్ 3/27).