
సఫారీలను కుప్పకూల్చారు..
బార్బడోస్: ముక్కోణపు సిరీస్లో వెస్టిండీస్ ఫైనల్కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో డారెన్ బ్రావో (102) సెంచరీతో పాటు బౌలర్లు రాణించడంతో విండీస్ 100 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ మరో బంతి మిగిలుండగా 285 పరుగులకు ఆలౌటైంది. బ్రావో సెంచరీతో పాటు పొలార్డ్ (62) హాఫ్ సెంచరీ చేశాడు. హోల్డర్ 40, బ్రాత్వైట్ 33 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లు మోరిస్, రబడ చెరో మూడు వికెట్లు తీశారు.
అనంతరం 286 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు.. విండీస్ బౌలర్ల ధాటికి 185 పరుగులకే కుప్పకూలారు. టాపార్డర్లో బెహార్డియన్ (35) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. మోర్నీ మోర్కెల్ 32 (నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ 29, పార్నెల్ 28 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు నరైన్, గాబ్రియెల్ చెరో మూడు, బ్రాత్వైట్ రెండు వికెట్లు పడగొట్టారు.