వైఎస్సార్‌సీపీతోనే గిరిజనుల అభివృద్ధి
త్రిపురారం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ సాగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మల్లు రవీందర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీత్రిపురారం జెడ్పీటీసీ అభ్యర్థి కొల్లి అన్నపూర్ణ, అప్పలమ్మగూడెం ఎంపీటీసీ అభ్యర్థి అజ్మీరా రంగానాయక్కు మద్దతుగా సోమవారం త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం, లోక్యాతండా, మంగళితండా, సీత్యా తండా, హర్జ్యా తండా, డొంకతండాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా తండాలో గిరిజనులు వైఎస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పలికారు. ఆయా సభల్లో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో విసిగి వేసారిన ప్రజలు ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపిం చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీ మండల కన్వీనర్ కందుకూరి అంజయ్య, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమావత్ జవహర్‌నాయక్, అనుముల సుధాకర్‌రెడ్డి, ఎస్కే బురాన్, చిట్టిమేని శ్రీనివాస్, కొల్లి రవికుమార్, మురళి, గోపి, రేవూరి లక్ష్మమ్మ, పగిడోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.