Tribal Reservation
-
14 నుంచి గిరిజన రిజర్వేషన్ పోరు యాత్ర
పంజగుట్ట (హైదరాబాద్): ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజనులు ఎక్కువగా నష్టపోయారని పలు గిరిజన సంఘాల నాయకులు, వక్తలు అభిప్రాయ పడ్డారు. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనున్న ‘గిరిజన రిజర్వేషన్ పోరుయాత్ర’ రెండవ విడత పోస్టర్, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, జనసేన యూత్ వింగ్ నాయకులు సంపత్‌నాయక్, కార్పొరేటర్ నీల రవినాయక్, బీజేపీ నాయకురాలు బాబీ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని తుంగలో తొక్కారని, ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లలో ఎంతో మంది గిరిజన యువకులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 1,200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ వారికి ఏం చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంచడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం తరహాలో రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు, ట్యాంక్‌బండ్‌పై ఠానూ నాయక్ విగ్రహం ఏర్పా టు, కర్ణాటక తరహాలో తాండా ఫైనాన్స్ అండ్ డెవ లప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
మా వద్ద 50% పైగా రిజర్వేషన్లు సబబే
న్యూఢిల్లీ: రాష్ట్రంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడాన్ని మేఘాలయ బుధవారం సుప్రీంకోర్టులో సమర్ధించుకుంది. 85% పైగా గిరిజనులు ఉన్న తమ రాష్ట్రంలో ఆ స్థాయి రిజర్వేషన్లు అవసరమని పేర్కొంది. మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను, ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును పునఃపరిశీలించే అంశాన్ని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆ ధర్మాసనం ముందు మేఘాలయ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ అమిత్ కుమార్ బుధవారం వాదనలు వినిపించారు. మేఘాలయ అనేక ప్రత్యేకతలు, వైవిధ్యత ఉన్న రాష్ట్రమని, అందువల్ల అసాధారణ పరిస్థితుల్లో అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని కోర్టుకు వివరించారు. ఇంద్ర సాహ్ని కేసును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని అమిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. పలు ఇతర రాష్ట్రాలు కూడా తమ వాదనలను వినిపించాయి. వాదనల అనంతరం విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టబద్ధ హక్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మంగళవారం కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ) జాబితాను రాష్ట్రాలు ప్రకటించే అధికారాన్ని 102వ రాజ్యాంగ సవరణ తొలగించదని వివరించింది. -
గిరిజన రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6.5 శాతంగా ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే రిజర్వేషన్లు 9.08 శాతంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం కేంద్రానికి సమర్పించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాన్క్లేవ్లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రం త్వరితంగా అనుమతులిస్తే వర్సిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏజెన్సీ రిజర్వేషన్ల వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతంలో టీచర్స్ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్ 3ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌తో సమీక్ష జరిపిన వైఎస్ జగన్ గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కనుక, తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: విదేశాల నుంచి వచ్చేవారి వివరాలు నమోదు 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' -
కేసీఆర్.. పచ్చి అబద్ధాలకోరు
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై బెదిరింపులు - మరో ఉద్యమానికి నాంది పలకాలి - గిరిజన రిజర్వేషన్ సాధన పోరు సభలో వక్తలు హైదరాబాద్: ప్రపంచంలోనే పచ్చి అబద్ధాలకోరు సీఎం కేసీఆర్ అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి తానే పీఠాన్ని అధిరోహించాడన్నారు. గిన్నిస్‌బుక్‌లో ‘అబద్ధాలకోరు’ కింద కేసీఆర్ పేరు చేర్చొచ్చన్నారు. నిరంతరం అభద్రతాభావంతో చచ్చి బతుకుతున్న వ్యక్తి కేసీఆర్ అని వారు దుయ్యబట్టారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ‘గిరిజన రిజర్వేషన్ సాధన పోరు సభ’.. అధ్యక్షుడు వెంకటేషన్చౌహాన్ అధ్యక్షతన జరిగింది. ఇందులో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చాక మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వస్తుందని కలలు కన్నామన్నారు. కేవలం ఒక్క ఇంటి వారే ఉద్యోగాలు పొందారని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని కాంక్షిస్తూ గొంతెతు త్తున్న వారిని అణగదొక్కితే గల్లంతవ్వక తప్పదని అరు ణోదయ విమలక్క అన్నారు. ప్రభుత్వం ఆగడాలను చూస్తూ ఊరుకుంటే చరిత్ర మనల్ని క్షమించదని, ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధికి పోరాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాచరిక పాలన నడిపిస్తున్నాడు కాబట్టే భయంతో బుల్లెట్‌ఫ్రూప్ బాత్రూమ్ను కూడా నిర్మించుకున్నాడని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. సమైక్యాంధ్ర పాలనలో వారు ఏనుగులను తింటే.. ఇప్పు డు సీఎం కుటుంబం పీనుగులను తింటుందని మా జీ ఎంపీ రవీంద్రనాయక్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ఏపీ వ్యాప్తంగా అలుపు లేకుండా తిరుగుతున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని కళాకారుడు ఏపూరి సోమన్న అన్నారు. మన హక్కుల కోసం ఆ విధం గా పోరాడాలన్నారు. ఓట్నీడ్ గ్యారెంటీ అధ్యక్షురాలు సొగ్రా చౌహాన్ తదితరులు ప్రసంగించారు.