మేం మోసపోయాం..!
► తిరిపుర చిట్‌ఫండ్ కార్యాలయం ఎదుట ఆందోళన
► గడువు దాటినానగదు ఇవ్వలేదంటున్న బాధితులు
రాయచోటి రూరల్: రాయచోటిలోని తిరిపుర చిట్స్ కార్యాలయం వద్ద మంగళవారం సుమారు 40 మంది బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. చిట్స్ వేసే సమయంలో 5నెలలకే నగదు చెల్లిస్తామన్న చిట్స్ కార్యాలయ మేనేజర్, సిబ్బంది ఏడాది, 14నెలలు దాటినా కూడా రోజుల తరబడి వాయిదాలు వేస్తూ , కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప నగదు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ మేరకు మంగళవారం తిరిపుర కేంద్ర కార్యాలయం చెన్నై నుంచి పలువురు అధికారులు రాయచోటి కార్యాలయానికి వచ్చారనే విష యం తెలుసుకున్న బాధితులు వారికి సంబం ధించిన చిట్స్ నోట్స్ తీసుకొని కార్యాలయానికి చేరుకున్నారు.
అక్కడ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకుం డా, రెండు రోజులు, 10రోజుల లోపు అందరికీ నగ దు ఇచ్చేస్తామంటూ గతంలో చెప్పిన విధంగానే చెప్పడంతో బాధితులు సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్స్ వేసుకునే సమయంలో అందరికీ 5నెలలు ప్రీమియం చెల్లించిన తరువాత 6 నెలల్లోనే వారు ఎంచుకున్న చిట్‌ఫండ్ మొత్తం ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ వి ధంగా చేయడం లేదని బాధితులు అం టున్నారు. కొందరికైతే ఇదిగో, అదిగో చెక్కులు ఇస్తామంటూ కాలం వెల్లదీస్తున్నారని వాపోతున్నారు. ఈ చిట్స్‌ను నమ్ముకుని తమ సొంత అవసరాలు, పనులు జరగక పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు మహిళలు, బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదు
కొందరు వ్యక్తులు వారి చిట్‌ఫండ్ గురించి ఆందోళనతో కార్యాలయానికి వచ్చారు. అందరితో మాట్లాడాము. కొందరికి నగదు ఇచ్చాము. ఎవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది. –జగదీష్‌రెడ్డి, రాయచోటి తిరిపుర బ్రాంచ్ మేనేజర్