19న మిచిగాన్‌లో ఉగాది వేడుకలు
మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది సంబారాలను నిర్వహించడానికి ట్రాయ్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉగాది సంబరాలను టీటీఏ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న రొచెస్టర్ హిల్స్ లోని రొచెస్టర్ అడమ్స్ హై స్కూల్లో జరపనున్నారు. ఈ వేడుకల్లో ఆట పాటలు, నాటకాలు, మాటల చమత్కారాలు అథితులను అలరిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడ్ జ్యోత్స్న కంకటాల, కల్చరల్ కమిటీ లీడ్ దీపా కనకపల్లి, స్టాల్స్ కమిటీ లీడ్ సంధ్య చొలవేటి, ఫుడ్ కమిటీ లీడ్ శశికళ తియ్యారి, పబ్లిసిటీ కమిటీ లీడ్ గాయత్రి గంగిసెట్టి, రిసిప్షన్ కమిటీ లీడ్ సీతాల పసుల, డెకరేషన్ కమిటీ లీడ్ రూప గండ్రలు ఉగాది వేడుకల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తెలుగువారు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.