నిరసనలు.. నిర్బంధాలు
సీఎం పర్యటన సందర్భంగా ఘటనలు
హన్మకొండ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నిరసనలు, నిర్బంధాల మధ్య కొనసాగింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాన్వాయిని అడ్డుకున్నారు. హన్మకొండలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్తున్న క్రమంలో మాస్టర్జీ కాలేజీ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు జెండా పట్టుకొని ఒక్కసారిగా దూసుకొచ్చారు.
జామర్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని తొలగిస్తుండగానే.. మరికొందరు విద్యార్థులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా పడుకున్నారు. దీంతో కేసీఆర్ భద్రతా సిబ్బంది, కేయూ సీఐ దేవేందర్‌రెడ్డి, స్థానికంగా బందోబస్తులో ఉన్న పోలీసులు విద్యార్థులను రోడ్డుపై నుంచి అడ్డు తొలగించి వాహనాన్ని, కాన్వాయిని పంపించారు. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జి చేశారు.
టీఆర్ఎస్ మహిళా నాయకుల నిరసన
లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ను కలుసుకునేందుకు టీఆర్ఎస్ మహిళా నాయకులను పోలీసులు అనుమతించలేదు. దీంతో రహీమున్నీసాబేగం నిరసన తెలిపారు. దీంతో ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించగా.. కిందికి దూకి వాహనం వెనక టైరుకు అడ్డంగా పడుకుంది. పోలీసులు బలవంతంగా ఆమెతో పాటు పలువురి మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఐకేపీ వీఓఏల దిగ్బంధం
సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ వీఓఏలు హన్మకొండ ఏకశిల పార్కులో ధర్నా చేపట్టారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్లో అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి అవాంతరాలు కలిగిస్తారనే ఉద్దేశంతో సీఐ కిరణ్‌కుమార్, ఎస్సైలు రాంప్రసాద్, విజ్ఞాన్‌రావు అదనపు బలగాలను రప్పించి పార్కులోనే వీఓఏలను దిగ్బంధించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
వీఓఏల సంఘం, సీఐటీయూ నాయకులను సీఎంతో మాట్లాడిస్తామని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి పోలీసులు తీసుకెళ్లారు. అయితే కేసీఆర్‌ను కలవకుండా తిరిగి పంపించడంతో వీఓఏలు మండిపడ్డారు. దీంతో కలెక్టరేట్ ముట్టడించాలనే పట్టుదలకు వచ్చారు. వెంటనే గ్రహించిన పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టి నివారించారు. వీరి ప్రతినిధులను కలెక్టరేట్‌కు సీఎంను కలిసేందుకు పంపించారు. అధికారులు కేసీఆర్‌తో మాట్లాడించగా.. వీఓఏలు సంతృప్తి చెందారు. కాగా, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టే వరకు ఏకశిల పార్కులో దిగ్బంధించి వెళ్లిపోయాక వారిని వదిలిపెట్టారు.
కాంగ్రెస్ నేతల నిర్బంధం
వరంగల్ : సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు కాం గ్రెస్ నేతలను నిర్బంధించారు. జిల్లా లో నెలకొన్న సమస్యలతోపాటు ఎన్నికల హామీలు అమలు చేయాలని వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. సీఎం నుంచి స్పందన లేకుంటే... ఆయన ముందే నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమాచారమందుకున్న పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం 7 గంటలకే డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని హన్మకొం డలోని ఆయన ఇంటిలో స్థానిక సీఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో నాయిని ఇంటివద్దకు చేరుకున్నాయి. నిరసనకు దిగడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు.
నాయినితోపాటు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, టీపీసీసీ మీడియా సెల్ కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, యువజన కాం గ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి, వరద రాజేశ్వర్‌రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, నాయకులు బిన్నీ లక్ష్మణ్, ధనరాజు, లింగాజి, రాయబారపు సాంబయ్య తదితరులు ఉన్నారు. కాగా, అనేక పోరాటాలు, త్యాగాల తో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం లో కొత్త సర్కార్ నియంతృత్వ విధానాలు అవలంభిస్తోందని ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల వినతి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాల కేటాయిం పు, హెల్త్ కార్డుల జారీకి చర్య తీసుకోవాలని కోరారు. సీఎం రాక సందర్భంగా కొందరు మీడియా ప్రతిని ధులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం, గృహ నిర్బం ధంలో ఉంచడం వంటి సంఘటన లు ఇకపై జరగకుండా చూడాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రతినిధులు పిన్నా శివకుమార్, భాస్కర్, సుధాకర్ ఉన్నారు.
ఐఎస్‌సీసీ సదస్సులో పాల్గొన్న గురునాథరావు
మహబూబాబాద్ టౌన్ : న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో ‘విజ్ఞానశాస్త్ర పరిపాలన-అనుసరించాల్సిన వ్యూహాలు’ అంశం పై ఈనెల 25 నుంచి 29వ తేదీ వర కు జరిగిన ఇండియన్ సైన్స్ కమ్యూనికేషన్ కాంగ్రెస్ (ఐఎస్‌సీసీ) - 2014 సదస్సులో మానుకోటకు చెం దిన సైన్స్ కమ్యూనికేటర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి.గురునాథరావు పాల్గొన్నారు. ‘భారతదేశ విజ్ఞానశా స్త్ర పరిపాలన ఎదుర్కొంటున్న సవాళ్లు-అవసరమైన నూతన వ్యూహాల’ పై పరిశోధన పత్రం సమర్పించారు.