'సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రలోనే పని చేయాలి'
దళిత సీఎం అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టలేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు (కేకే) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాలను ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని సీఎం చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇంకా తమ పార్టీ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులంతా ఆంధ్రప్రదేశ్లోనే పని చేయాలని కేకే అభిప్రాయపడ్డారు.
గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే దళిత కులానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆ అంశాన్ని కేసీఆర్ విస్మరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు మాట తప్పారంటూ కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఇవ్వమని.... తృతీయ ప్రంట్ను మద్దతు ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.