'బంగారు తెలంగాణలో యువత ముందుండాలి'
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిముక్కల పద్మారావు అన్నారు. ఆదివారం మోతీనగర్ డివిజన్‌కు చెందిన పలువురు విద్యార్థి నాయకులు టీఆర్ఎస్ కూకట్పల్లి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆర్.రమేష్‌నాయక్ ఆధ్వర్యంలో పద్మారావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పద్మారావు వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో యువత ముందుండాలని అన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.