trs leader vinod
-
'ఆర్టికల్ 371-డిపై తప్పుదోవ పట్టిస్తున్నారు'
హైదరాబాద్ : ఆర్టికల్ 371-డిపై సీమాంధ్ర ప్రాంత నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు. 371-డి ఉన్నందున రాష్ట్ర విభజన సాధ్యం కాదన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు.రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర విభజన చేయవచ్చని వినోద్ అన్నారు. గతంలో పంజాబ్-హర్యానా విడిపోయినప్పుడు కూడా 371 రాజ్యాంగ సవరణ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 371-డిపై తోచిన విధంగా మాట్లాడుతున్నారని వినోద్ విమర్శించారు. మరోవైపు నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం చేసిన రాజ్యాంగ సవరణ దరిమిలా తెరమీదకు వచ్చిన 371డి అధికరణ విభజన నేపథ్యంలో గుదిబండగా మారనుందా? చర్చనీయాంశంగా మారిన పలు సందేహాలకు అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్కు చెందిన ఒక న్యాయవాది కోర్టులో పిల్ వేసిన పిల్ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన ఈ అంశానికి సంబంధించి కేంద్రంలో గుబులు మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు 1973లో సవరించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ‘డి’అధిక రణ కీలకంగా మారనుందనే ప్రచారానికి బలం చేకూరుతోంది. -
బాబు సీమాంధ్ర యాత్ర సమర్థనీయం: వినోద్
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్రను టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ సమర్థించారు. శనివారం ఉదయం ఓ ఛానల్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీమాంధ్రలు తమ హక్కుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అన్నారు. కొత్త రాష్ట్ర రాజధానితో పాటు, ఇతర వాటి కోసం సీమాంధ్రులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని వినోద్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్రుల రాజకీయాల వల్లే తెలంగాణ ఏర్పాటు కోరామని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాధ్యత వహించక తప్పదని వినోద్ స్పష్టం చేశారు. మన్మోహన్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు. కాగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నుంచి ఆత్మ గౌరవ యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబు ఢిల్లీ యాత్ర ఎందుకు?: వినోద్
-
చంద్రబాబుపై మండిపడ్డ టీఆర్ఎస్ నేత వినోద్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్ఎస్ నేత వినోద్ శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్కు చంద్రబాబు లేఖ రాయడాన్ని కుట్రపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. రాజాధికారం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు. గతంలో అన్నీ పార్టీలు తెలంగాణా ప్రత్యేక రాష్ట ఏర్పాటుకు సానుకూలంగానే స్పందించాయని బాబు ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్రలో నిరసన జ్వాలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయని చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. అంతేకాకుండా డిసెంబర్ 9 తర్వాత రాష్టంలో పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయన్నారు. అలాగే ప్రత్యేక రాష్టం ఏర్పాటుతో సీమాంధ్రకు జరుగనున్న అన్యాయాన్ని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు వెల్లడించారు.