ఆదిలాబాద్ అడవుల్లో భారీ కూంబింగ్
ఆదిలాబాద్: టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ వ్యవహారంతో తెలంగాణలో వాతావరణం వేడెక్కింది. కూంబింగ్‌లు, అనుమానితుల అరెస్టులతో తెలంగాణ జిల్లాలు ఉద్రిక్తంగా మారాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దున ఉన్న రిజర్వు ఫారెస్టులో గురువారం నుంచి భారీగా కూంబింగ్ కొనసాగుతోంది. శుక్రవారం కూడా సుమారు 400 మంది పోలీసులు 14 బృందాలుగా విడిపోయి అడవుల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. 30 నుంచి 50 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీసుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా చర్లలో బుధవారం కిడ్నాప్‌నకు గురైన నేతల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిణామాలతో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గిరిజనులు వణికిపోతున్నారు.