TRS leaders kidnapped
-
మావోయిస్టుల చెర నుంచి టీఆర్ఎస్ నేతల విడుదల
-
మావోయిస్టుల చెర నుంచి టీఆర్ఎస్ నేతల విడుదల
ఖమ్మం: మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు విడుదలయ్యారు. మూడు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఆరుగురు టీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు. శనివారం ఉదయం చత్తీస్ గడ్ సరిహద్దులో టీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టారు. టీఆర్ఎస్ నేతలు కాసేపట్లో ఖమ్మం జిల్లా చర్లకు చేరుకోనున్నారు. భద్రాచలం నియోజక వర్గ ఇంఛార్జి నూనె రామకృష్ణ, చర్ల , వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన వెంకటేశ్వర్లు, సురేష్ , జనార్థన్, రామకృష్ణ, సత్యనారాయణలను ఈ నెల 18 న చర్ల మండలం కూసుగుప్ప లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. -
టీఆర్ఎస్ నేతల కిడ్నాప్!
-
టీఆర్ఎస్ నేతల కిడ్నాప్!
భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు నేతలను మావోయిస్టులు బుధవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం పూసగప్పలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత రామకృష్ణ సహా ఆరుగురిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం టీఆర్ఎస్ తరఫున పోటీచేసి రామకృష్ణ ఓడిపోయారు. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొనసాగుతున్నారు. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన వారిలో టీఆర్ఎస్ డివిజన్ కార్యదర్శి మానె రామకృష్ణతోపాటు చర్ల మండలం టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పటేల్ వెంకటేశ్వరరావు, మండల మాజీ కార్యదర్శి సంతపురి సురేష్కుమార్, వెంకటాపురం మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యనారాయణ, వాజేడు మండలం పార్టీ అధ్యక్షుడు దత్తకట్ల జనార్ధన్, పూసుగప్ప మాజీ సర్పంచి రామకృష్ణ ఉన్నారు. కూంబింగ్, అక్రమ అరెస్టులు నిలిపివేయాలంటూ మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.