'టీఆర్ఎస్ విలీనానికి సమయం ఆసన్నమైంది'
తెలంగాణ ప్రజల ఆకాంక్షను యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీర్చారని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆమెకు జన్మజన్మలకు రుణపడి ఉంటారన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విలీనం అయ్యే సమయం ఆసన్నమైందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అందుకు సంబంధించిన ప్రక్రియను అధిష్టానం చూస్తుందన్నారు. అయితే సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్గ్రపతి పాలన వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.సీఎం రేసులో తాను మాత్రం లేనని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని డి.శ్రీనివాస్ వెల్లడించారు.