టీఆర్ఎస్ పార్టీ నియమావళికి సవరణలు
మూడు మార్పులకు ప్లీనరీలో ఆమోదం
సంస్థాగత ఎన్నికలు ఇక నాలుగేళ్లకోసారి..
జిల్లా కమిటీలు రద్దు
నియోజకవర్గ కమిటీలదే కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నియమావళిలో మూడు మార్పులను చేస్తూ పార్టీ 16వ ప్లీనరీ నిర్ణయం తీసుకుంది. పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇక నుంచి జిల్లా కమిటీలు ఉండవని, జిల్లాలో కేవలం సమన్వయం కోసం కన్వీనర్ ఉంటారని ప్రకటించారు. రెండో మార్పుగా.. నియోజకవర్గ కమిటీలను కొత్తగా తెరపైకి తెచ్చారు. జిల్లాల్లో ఇక నుంచి నియోజకవర్గ కమిటీలకే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉండి, అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అలాగే ఇక నుంచి రెండేళ్లకోసారి కాకుండా పార్టీ సంస్థాగత ఎన్నికలను నాలుగేళ్లకోసారి జరపాలని మూడో సవరణ చేశారు.
ఎన్నికల సంఘం సైతం నాలుగేళ్లకోసారి పార్టీ ఎన్నికలు పెట్టుకోవచ్చని ప్రకటించిందని, దీంతో టీఆర్ఎస్ ఎన్నికల కాలాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ మార్పులు చేసినట్లు కేకే తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేత కృష్ణమూర్తి ఈ ప్రతిపాదను బలపరచగా.. ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ సంధానకర్తగా ఉండాలని, ప్రజలకు మరింత దగ్గరగా ఉండేందుకే మార్పులు చేసినట్లు ప్రకటించారు.
రూ.2.25 కోట్ల విరాళాలు
పదహారో ప్లీనరీ సందర్భంగా పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు విరాళాలు ప్రకటించారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సలీం రూ.కోటి చొప్పున చెక్కులను పార్టీ సెక్రటరీ జనరల్ కేకేకు అందజేశారు. పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి రూ.25 లక్షల చెక్కు అందజేశారు.
‘విత్తనాల ధరలు తగ్గించాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాల ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (సీపీఐ) డిమాండ్ చేసింది. విత్తనాలు, పురుగు మం దుల కొనుగోళ్లకు వచ్చే వానాకాలం పంట నుంచే ప్రభుత్వం ఆర్థిక సాయం చేయా లని సంఘ ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. సబ్సిడీపై రైతులకు పంపి ణీ చేసే విత్తనాల ధర మార్కెట్ ధరకు సమానంగానే ఉన్నాయని విమర్శించారు.