బాబుకు ఇక్కడ అడుగు పెట్టే హక్కు లేదు
హోం మంత్రి నాయిని
సైదాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో అడుగు పెట్టే హక్కు లేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన కుట్రలే వెయ్యి మంది విద్యార్థుల బలిదానానికి కారణమయ్యాయని మండిపడ్డారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం తిరుగుతున్నారని నాయిని ప్రశ్నించారు. ఐఎస్‌సదన్ డివి జన్‌కు చెందిన టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి శుక్రవారం హోం మంత్రి నాయిని సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఐఎస్ సదన్‌లో ఏర్పాటు చేసిన సభలో కోట్ల మెడలో గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ టీడీపీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఆరోపించారు.
‘నీవు ఆంధ్రాకి ముఖ్యమంత్రివి. నీ నూకలు అక్కడే చెల్లుతలేవు. ఇక ఇక్కడేం చెల్లుతుందని’ ప్రశ్నిం చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 1.80 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని తెలి పారు. అద్దె ఇళ్లలో ఉంటున్నవారికి నగర శివారులో వెయ్యి ఎకరాలలో సీఎం అపార్ట్మెంట్లు కట్టించి ఇస్తారని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఐఎస్ సదన్ డివిజన్ అభ్యర్థి సామ స్వప్నసుందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అమరవాది లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, మన్నె రంగా, సామ సుందర్‌రెడ్డి, మామిడోజు శంకరాచారి, లక్ష్మణ్‌రావు, పన్నాల పర్వతాలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.