సెక్రటేరియట్ ముట్టడికి ఐకేపీ ఉద్యోగుల యత్నం
హైదరాబాద్: వేతనాలు చెల్లించాలంటూ ఐకేపీ ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేలమంది ఐకేపీ వాలంటీర్లు శనివారం హైదరాబాద్ తరలివచ్చారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఐకేపీ ఉద్యోగులు ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని ధర్నా చౌక్ వద్దే అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఐకేపీ ఉద్యోగులు సెక్రటేరియట్ వైపు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐకేపీ వాలెంటీర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఐకేపీ ఉద్యోగులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించగా, పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు.