సోషల్ సెన్సైస్ కోర్సులు
వివిధ స్పెషలైజేషన్లలో సోషల్ సెన్సైస్ కోర్సులను అందించడంలో దేశంలోనే అగ్రశ్రేణి విద్యా సంస్థ.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్). దీనికి ముంబై ప్రధాన కేంద్రంగా హైదరాబాద్, తుల్జాపూర్, గువహటి, చెన్నైల్లో క్యాంపస్లున్నాయి.2017 విద్యా సంవత్సరానికి టిస్ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకుప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిస్ పీజీ కోర్సులు.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియతదితర వివరాలపై ప్రత్యేక కథనం..
పీజీ కోర్సులు .. క్యాంపస్లు
ముంబై క్యాంపస్: ఎంఏ ఇన్.. ఎడ్యుకేషన్ (ఎలిమెంటరీ); డెవలప్మెంట్ స్టడీస్; ఉమెన్స్ స్టడీస్; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ సైకాలజీ; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ; గ్లోబలైజేషన్ అండ్ లేబర్; హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్; సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్; సోషల్ వర్క్ ఇన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ తదితర.
ఎంఏ/ఎంఎస్సీ.. క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టైయినబిలిటీ స్టడీస్; రెగ్యులేటరీ గవర్నెన్స్; అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్; వాటర్ పాలసీ అండ్ గవర్నెన్స్; డిజాస్టర్ మేనేజ్మెంట్.
మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (ఎంహెచ్ఏ)
గువహటి క్యాంపస్: ఎంఏ ఇన్.. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్; లేబర్ స్టడీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్; పీస్ అండ్ కన్ఫ్లిక్ట్ స్టడీస్; సోషియాలజీ అండ్ సోషల్ ఆంత్రోపాలజీ; సోషల్ వర్క్ ఇన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్; సోషల్ వర్క్ ఇన్ కౌన్సెలింగ్; సోషల్ వర్క్ ఇన్ లైవ్లీహుడ్స్ అండ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్; సోషల్ వర్క్ ఇన్ పబ్లిక్ హెల్త్.
చెన్నై క్యాంపస్: ఎంఏ ఇన్.. సోషల్ వర్క్ ఇన్ మెంటల్ హెల్త్; సోషల్ వర్క్ ఇన్ హెల్త్, మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ సైకాలజీ; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ.
తుల్జాపూర్ క్యాంపస్: ఎంఏ ఇన్.. సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్; సోషల్ వర్క్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. ఎంఏ/ఎంఎస్సీ.. ఇన్ డెవలప్మెంట్ పాలసీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్; సస్టైయినబుల్ లైవ్లీహుడ్స్ అండ్ నేచురల్ రిసోర్సెస్ గవర్నెన్స్.
హైదరాబాద్ క్యాంపస్: ఎంఏ ఇన్.. ఎడ్యుకేషన్; పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్; డెవలప్మెంట్ స్టడీస్; నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్; రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్; ఉమెన్స్ స్టడీస్; హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్.
అర్హత: 10+2+3 లేదా 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కొన్ని కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీలో నిర్దేశిత సబ్జెక్టులు అభ్యసించినవారు మాత్రమే అర్హులు.
ఎంపిక: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష.. టిస్నెట్ (100 మార్కులు), ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్/గ్రూప్ డిస్కషన్ (50 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (75 మార్కుల) ద్వారా ఎంపిక ఉంటుంది.
ప్రవేశ పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో గంటా నలభై నిమిషాల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో జనరల్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీలపై ప్రశ్నలు ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్ ద్వారా రూ.1030 చెల్లించాలి. ఏడాదికి రూ.2.5 లక్షలలోపు ఆదాయమున్న ఎస్సీ/ఎస్టీలు, రూ.లక్షలోపు ఆదాయమున్న ఓబీసీ ఎన్సీఎల్లు రూ.260 పే చేయాలి.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2016
పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: డిసెంబర్ 1, 2016
నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్): జనవరి 7, 2017
వెబ్సైట్: http://admissions.tiss.edu/