నేడు పీజీఈసెట్ తొలి జాబితా విడుదల
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను బుధవారం(16న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పీజీఈసెట్– 2017 కోకన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, కళాశాలల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు తమ పేర్లను http:// www. osmania. ac. in/ వెబ్సైట్లో చూడవచ్చన్నారు.