మాకు ముందే తెలుసు
శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్
వేసవి డిమాండ్‌పై ముందే ఓ అంచనాకు వచ్చాం. ఇప్పటికే లైన్స్‌ను పునరుద్ధరించాం. పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. రూ.240 కోట్లు ఖర్చు చేసిమెరుగైన సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.