పుష్కరాలకు నిరంతర విద్యుత్
అలంపూర్ రూరల్ : పుష్కరాలు మొదలు నుంచి ముగిసేవరకు నిరంతర విద్యుత్ అందిస్తామని టీఎస్‌సీపీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బీచుపల్లి, గొందిమల్ల పుష్కరఘాట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పుష్కర సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలంపూర్ గొందిమల్ల ఘాట్ దగ్గర 100కేవీ, 25 కెవీ సామర్థ్యంతో మూడు ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈఓ గురురాజ, సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య ఆచారి అధికారికి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం అర్చకులు వారికి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. శ్రీనివాస్‌రెడ్డి వెంట ఎస్ఈ రాముడు, డీఈ శ్రీనివాస్, ఇన్చార్జ్ ఏడీఈ సుబ్బారాయుడు, ఏఈ నరసింహప్రసాద్, జూనియర్ లైన్మెన్ రవి తదితరులు ఉన్నారు.