Tshirt
-
రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని బనిహాల్‌లో సాగుతున్న రాహుల్ యాత్రలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్పీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఒమర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ను పెంచడం కోసం కాదని, దేశంలోని పరిస్థితిని మార్చడం కోసమేనని చెప్పారు. అందువల్లే తాను ఈ యాత్రలో పాల్గొన్నట్లు వివరించారు. ఈ యాత్రను గాంధీ వ్యక్తిగత కారణాలతో ప్రారంభించలేదని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో చేస్తున్న యాత్రగా అభివర్ణించారు. ఈ ప్రభుత్వం అరబ్ దేశాలతో స్నేహం చేస్తున్నప్పటికీ దేశంలోని అతిపెద్ద మైనారిటీ నుంచి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో ప్రతినిధులుగా లేరని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ..దీని పునరుద్ధణ కోసం కోర్టులో పోరాడతాం అన్నారు. ఈ సందర్భంలో ఆ రాష్ట్రంలోని ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు పూర్తయిందని, చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయన్నారు. రెండు ఎన్నికల మధ్య ఈ గ్యాప్ చాలా ఎక్కువే అని చెప్పారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడూ కూడా జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఎన్నికలు కోసం అడుక్కోవాలని కోరుకుంటోందని అన్నారు. అయినా తాము బిచ్చగాళ్లం కాదని దాని కోసం తాము అడుక్కోమని తేల్చి చెప్పారు. కాగా ఈ యాత్రలో ఇరు నాయకులు ఒకేలాంటి టీషర్ట్‌ల ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. యాత్రకు బ్రేక్ చక్కగా సాగిసోతున్న రాహుల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్ పడింది. ఆయన భద్రతా దృష్ట్యా అనుహ్యంగా రద్దైంది. ఈ రోజు రాహుల్ జోడో యాత్రలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా ..కేవలం కిలోమీటర్ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది. ఐతే కాశ్మీర్లో ఆయన కోసం ఊహించని విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనకు కారణమైందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేశాయి. రాహుల్ శ్రీనగర్‌కు సమీపంలోని బనిహాల్ టన్నెల్ దాటిన తర్వాత పెద్ద ఎత్తున భారీ జన సముహం రావడంతో దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ కదలేకపోయినట్లు తెలిపాయి, అదీగాక అక్కడ తగిన విధంగా భద్రత లేకపోవడంతోనే యాత్ర ఆపేయవలసి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గాంధీని భద్రతా వాహనంలో తీసుకెళ్లి యాత్రను విరమింపజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లాల భద్రతకు సంబంధించి తగిన సంఖ్యలో పోలీసుల లేరని, తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సమాచారం. (చదవండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని) -
లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు!
టెక్సాస్: సాధారణంగా దొంగలు మెడలోని బంగారం.. చేతిలోని ఫోన్లు.. ఖరీదైన వస్తువులను చోరీ చేస్తుండంటాన్ని మనం చూసుంటాం. కానీ, మహిళలు దొంగతనం చేయటం చాలా అరుదు. అలాంటిది పట్టపగలు ఓ ఇంటి ముందు దొంగతనం చేయటం.. దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పని చేసుకుపోవటం సాధారణ విషయం కాదు. అమెరికాకు చెందిన ఓ మహిళ గుమ్మం ముందు పెట్టిన ఒక పార్శిల్‌ను చోరీ చేసి, దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తింది. వివరాలు.. కొద్దిరోజుల కిత్రం టెక్సాస్‌లో ఇంటి ముందు పార్శిల్ పెట్టి పెట్టి వెళ్లిపోయాడు పార్శిల్ సర్వీస్ అతను. ఆ పార్శిల్‌ను ఓ చోరీ చేయాలనుకొంది. పార్శిల్‌ను చూడగానే పరిగెత్తుకొంటూ వచ్చి రెప్పపాటులో దాన్ని తీసుకొని పారిపోయింది. ఈ క్రమంలో ఆమె వేసుకున్న టీషర్ట్ జారీపోయింది. అయితే, ఆ లేడీ దొంగ ఇదేమి పట్టించుకోలేదు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. దీనిలో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తొంది. తొందరలోనే ఆ మహిళను పట్టుకుంటామని కౌంటీ ప్రెసింట్ కానిస్టేబుల్ అలన్ రాసెన్ తెలిపారు. దీనిపై పెద్దగా శిక్షలుండవని, కేవలం ఆ వస్తువు విలువను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఘరానా దొంగ’, ‘లేడి డాన్’, ‘దొంగతనం కూడా ఆర్ట్ ’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: సెక్స్‌డాల్‌తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు! -
టీషర్ట్స్ దాచి అడ్డంగా దొరికిపోయాడు
టీ.నగర్ : తిరుపూర్ సమీపంలో తాను పనిచేస్తున్న ఓ కంపెనీ నుంచి వేల రూపాయల విలువైన టీ షర్ట్‌లను దుస్తుల్లో దాచి చోరీ చేసిన వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. తిరుపూర్ జిల్లా పెరుమానల్లూర్ సమీపంలోని నేతాజీ అపేరెల్ పార్క్‌లో అనేక ఎక్స్పోర్ట్ బనియన్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. వీటిలో బయటి రాష్ట్రాలకు చెందిన అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులోని ఒక ఎక్స్పోర్ట్ సంస్థలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఒకడు పనిచేస్తున్నాడు. కాగా ఈ ఘటన జరిగిన రోజున ఆ వ్యక్తి తన విధులు ముగించుకుని కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో గేట్ వద్ద ఉన్న వాచ్‌మన్‌కు అతనిపై అనుమానం ఏర్పడింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడంతో వాచ్‌మన్ అతని వద్ద తనిఖీలు జరిపాడు. తను వేసుకున్న షర్ట్ లోపల టీషర్టులను ధరించినట్లు గుర్తించాడు. ప్యాంట్లో కూడా కొన్ని షర్ట్‌లను దాచుకున్నాడు. ఈ విధంగా మొత్తం 40 టీషర్ట్లను దాచినట్లు తెలిసింది. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న సంస్థ నిర్వాహకులు కార్మికుడిని హెచ్చరించి, ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
టీషర్ట్స్ దాచి దొరికిపోయాడు
-
క్రేజీ డాడీ.. ఏం చేశాడో చూడండీ..!
ఫ్లోరిడాకు చెందిన క్రిస్ అల్లెన్ తండ్రి అనే పదానికి అర్థాన్ని చూపించాడు. పసిపాపలపై తల్లులు మాత్రమే కాదు, తండ్రి కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో ఉంటారని నిరూపించాడు. అసలు విషయం ఏంటంటే.. క్రిస్ అల్లెన్, జెన్నిఫర్ కాపో భార్యాభర్తలు. అయితే జెన్నిఫర్ ఉద్యోగం చేస్తోంది. కుటుంబాన్ని పోషించాలంటే ఎవరో ఒకరు జాబ్ చేయక తప్పని పరిస్థితి. వీరికి నెలల పాప ఉంది. భార్య జెన్నిఫర్ ఇంటి పట్టాన ఉండటం వీరి ఇంట్లో కుదరదు. అందుకే తన పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఎంత ప్రేమగా చూసుకున్నా, చిన్నారికి పాలివ్వాల్సి రావడం కాస్త సమస్యగా మారింది. దీనికి ఓ సొల్యూషన్ ఆలోచించాడు. పాపకు పాలిచ్చే సమయంలో అతడు టీషర్ట్ వేసుకుని దానికి పాల పీపా పట్టే అంతటి రంద్రాన్ని చేశాడు. తల్లులు పాలిస్తున్నట్లే తన పాపను ఒడిలో పెట్టుకుని, ఇంకా నిల్చున్నప్పుడు కూడా టీషర్ట్ లోపల పాలు నింపిన పీపాను పెట్టి చిన్నారికి పాలు ఇవ్వడం చేస్తున్నాడు. ఇక చిన్నారి ఏడవడం అనేది లేకుండా పాలిచ్చి, జోకొడుతూ పాపను తండ్రి క్రిస్ అల్లెన్ నిద్రపుచ్చుతుంటాడు. భార్య ఇంటికి వచ్చే వరకూ అలా చిన్నారి ఆలనాపాలనా బాధ్యతలు స్వీకరించాడు.