Published
Fri, Jun 3 2016 11:29 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
క్రేజీ డాడీ.. ఏం చేశాడో చూడండీ..!
ఫ్లోరిడాకు చెందిన క్రిస్ అల్లెన్ తండ్రి అనే పదానికి అర్థాన్ని చూపించాడు. పసిపాపలపై తల్లులు మాత్రమే కాదు, తండ్రి కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో ఉంటారని నిరూపించాడు. అసలు విషయం ఏంటంటే.. క్రిస్ అల్లెన్, జెన్నిఫర్ కాపో భార్యాభర్తలు. అయితే జెన్నిఫర్ ఉద్యోగం చేస్తోంది. కుటుంబాన్ని పోషించాలంటే ఎవరో ఒకరు జాబ్ చేయక తప్పని పరిస్థితి. వీరికి నెలల పాప ఉంది. భార్య జెన్నిఫర్ ఇంటి పట్టాన ఉండటం వీరి ఇంట్లో కుదరదు. అందుకే తన పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.
ఎంత ప్రేమగా చూసుకున్నా, చిన్నారికి పాలివ్వాల్సి రావడం కాస్త సమస్యగా మారింది. దీనికి ఓ సొల్యూషన్ ఆలోచించాడు. పాపకు పాలిచ్చే సమయంలో అతడు టీషర్ట్ వేసుకుని దానికి పాల పీపా పట్టే అంతటి రంద్రాన్ని చేశాడు. తల్లులు పాలిస్తున్నట్లే తన పాపను ఒడిలో పెట్టుకుని, ఇంకా నిల్చున్నప్పుడు కూడా టీషర్ట్ లోపల పాలు నింపిన పీపాను పెట్టి చిన్నారికి పాలు ఇవ్వడం చేస్తున్నాడు. ఇక చిన్నారి ఏడవడం అనేది లేకుండా పాలిచ్చి, జోకొడుతూ పాపను తండ్రి క్రిస్ అల్లెన్ నిద్రపుచ్చుతుంటాడు. భార్య ఇంటికి వచ్చే వరకూ అలా చిన్నారి ఆలనాపాలనా బాధ్యతలు స్వీకరించాడు.