breastfeed
-
పాజిటివ్ వచ్చినా తల్లి పాలివ్వొచ్చా? డాక్టర్లు చెప్తున్నదేంటి..
వరంగల్ ఎంజీఎం: ‘కరోనా వైరస్ కొద్ది రోజులుగా విస్తరిస్తోంది. కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ నిర్ధారణ అయిన కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులెవరూ కరోనాతో అస్వస్థతకు గురికాకపోవడం మంచి పరిణామమే’ అని ఎంజీఎం పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.సుధాకర్ శుక్రవారం ‘సాక్షి ఫోన్ ఇన్’లో పేర్కొన్నారు. పలువురు చిన్న పిల్లల తల్లులు తమకు పాజిటివ్ వస్తే.. పిల్లలకు పాలు పట్టించొచ్చా అని డాక్టర్‌ను ప్రశ్నించగా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చని, పాల ద్వారా కరోనా వ్యాప్తి జరగదని స్పష్టం చేశారు. గర్భిణులు 12 వారాల తర్వాత కచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే పుట్టిన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్ నాకు రెండేళ్ల చిన్నారి ఉంది. కరోనా లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రియ, హన్మకొండ డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గును కరోనా లక్షణాలుగా పరిగణిస్తాం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించాలి. నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సాధారణ జ్వరం వస్తే పారాసిటమాల్ సిరఫ్ వాడుకోవచ్చు. (చదవండి: కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..) నాకు ఈనెల 13న పాజిటివ్ వచ్చింది. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గింది. మళ్లీ టెస్టు చేయించుకోమంటారా? – నసీరొద్దీన్, హన్మకొండ డాక్టర్ ::ప్రస్తుతానికి మీకు కరోనా లక్షణాలేమీ లేకపోతే పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లొచ్చు. 14 రోజుల వరకు మాస్క్ తప్పనిసరిగా ధరించి మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెగెటివ్ కోసం మళ్లీ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నిర్ధారణ అయి ఆరు రోజులైంది. ప్రస్తుతానికి నీరసంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – ఈశ్వర్, భీమారం డాక్టర్ : కరోనా తగ్గిన తర్వాత కొద్దిగా నీరసంగా ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా.. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఆ మేరకు చికిత్స పొందాలి. కరోనా తగ్గిన తర్వాత కూడా మల్టీ మిటమిన్ మాత్రలు వేసుకోవడం మంచిది. ఒకే గదిలో ఇద్దరు మిత్రులం ఉంటాం. నా మిత్రుడికి పాజిటివ్ వచ్చింది? నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. పరీక్ష చేసుకోవడం తప్పనిసరా? – లక్ష్మణ్, రాయపర్తి డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వ్యక్తికి అతి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాల్సిందే. తలనొప్పి.. కొద్ది నీరసంగా ఉందని చెబుతున్నారు కదా.. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత చికిత్స పొందాలి. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోమంటారు? – భూక్య రామ్, వరంగల్ డాక్టర్ : కరోనా వ్యాధికి గురైన సమయంలో మన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. అందుకే మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. మా ఇంట్లో నా భర్తకు పాజిటివ్ వచ్చింది. నాకు ఏడాది పాప ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – భీమారం, అనూష డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ జరిగినప్పుడు వారికి దూరంగా పిల్లలను ఉంచాలి. వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత చిన్నారులకు పాలు ఇవ్వొచ్చా? – భానుప్రియ, పోచమ్మమైదాన్ డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా మాస్క్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులకు పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ద్వారా చిన్నారులకు కరోనా వ్యాప్తి జరగదు. మా ఇంట్లో అందరికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న కిట్టు మందులు వాడితే సరిపోతుందా? – సిద్ధార్థ, పలివేల్పుల డాక్టర్ : ప్రభుత్వం అందిస్తున్న కిట్టు మందులు వాడుతున్న సందర్భంలో శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చేక్ చేసుకోవాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆస్పత్రిలో చేరాలి. (చదవండి: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..) -
అమృతమూర్తి పట్రీషా
‘‘ఫ్లయిట్ టేకాఫ్ అయింది. అంతా బాగానే ఉంది. ఇంతలోనే చిన్నపాప గుక్కపట్టిన ఏడుపు. ఉన్నపళంగా ఆ బుజ్జిదాని కోసం ఏమైనా చేయాలనిపించేంత బాధగా ఏడుస్తోంది. ఆ వైపు వెళ్లాను. ఆ బిడ్డను సముదాయించలేక తల్లి అవస్థపడుతోంది. ‘బహుశా ఆకలేస్తోందేమో.. పాలు పట్టకపోయారా?’ అడిగా. నిస్సహాయంగా చూసిన ఆమె కళ్లల్లో నీళ్లు. ‘అరే.. ఏమైంది? అంతా ఓకే కదా?’ అన్నాను కంగారుగా. ‘పోతపాలు పట్టాలి. నేను తెచ్చినవి అయిపోయాయి’ అంది ఆమె బేలగా. తోటి ప్రయాణికులు ఏడుస్తున్న పాప వంక జాలిగా చూడ్డం మెదలుపెట్టారు. ఫ్లయిట్ లైన్ అడ్మినిస్ట్రేటర్.. మిస్ షేర్లీ విల్ఫ్లోర్.. బిడ్డను తీసుకొని గ్యాలే (ఫ్లయిట్లో కిచెన్ లాంటి చోటు) కి వెళ్లమని సూచించింది. పాపాయేమో ఆగకుండా ఏడుస్తూనే ఉంది. ఫ్లయిట్లోకూడా పోతపాలు లేవు. నా మనసు చివుక్కుమంది. ఎలా? పాపం.. పసిదానికి ఎంత ఆకలేస్తోందో ఏమో? ఆ టైమ్‌లో నేను చేయగల పని ఒక్కటే.. సంకోచం లేకుండా ఆ తల్లికి చెప్పాను.. ‘మీకు అభ్యంతరం లేకపోతే.. మీ బిడ్డకు నేను పాలిస్తాను. నాకూ తొమ్మిది నెలల కూతురు ఉంది. ఇంకా పాలిస్తున్నాను. పట్టనా?’ అని ఆగాను. ఆ తల్లి గబగబా కళ్లు తుడుచుకొని తన బిడ్డను నా చేతుల్లో పెట్టింది. పాలు తాగుతూ తాగుతూ అలాగే నా ఒళ్లో నిద్రపోయింది చిట్టితల్లి. పాప నిద్రపోయాక ఆ అమ్మ మొహంలో చెప్పలేని రిలాక్సేషన్. బిడ్డను ఆమెకు అప్పగించి తన సీట్ వరకూ తోడు వెళ్లా. ఆమె ప్రశాంతంగా కూర్చున్నాక నేను వెనుదిరుగుతుంటే నా చేయి పట్టుకుంది.. మళ్లీ ఆమె కళ్ల నిండా నీళ్లు.. కృతజ్ఞతతో! నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా.. ఒక బిడ్డ ఆకలి తీర్చే శక్తి నాకు ఇచ్చినందుకు.. వరంగా అమృతాన్ని నాలో నింపినందుకు!ఈ ఫ్లయిట్ ఎక్కేముందే అనుకున్నా.. ఇది నాకు చాలా స్పెషల్ అని.. ఎందుకంటే అంతకుముందే ఎవాల్యుయేటర్‌గా ప్రమోషన్ తీసుకున్నా. కాని ఇంత ప్రత్యేకమని ఊహించలేదు.’’ఇది ఫేస్బుక్ పోస్ట్. నాలుగైదు రోజులుగా వైరల్ అవుతోంది. పెట్టిన రోజే 34 వేల షేర్లు పొందింది. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి పేరు పట్రీషా ఒర్గానో. 24 ఏళ్లు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వాస్తవ్యురాలు. ఆ దేశానికి చెందిన ఓ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. డ్యూటీ లేని వేళల్లో తల్లి పాల ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది íఫిలిప్పీన్స్‌లో. మాటలే కాదు.. బిడ్డ ఆకలితీర్చే సమయమొస్తే చేతల్లోనూ చూపెట్టింది పట్రీషా. ఫ్లయిట్లో ఏడ్చిన బిడ్డ తల్లి అంతకుముందు రోజు రాత్రంతా కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంది. అందుకే పోతపాలు అయిపోయాయి. ఫ్లయిట్లో ఉంటాయేమో అనుకుంది. తెల్లవారు ఝామున ఈ ఫ్లయిట్ ఎక్కింది. దురదృష్టవశాత్తు పోతపాలు లేవు. అదృష్టవశాత్తు అమ్మ పాలే దొరికాయి! -
ఈ ఎయిర్ హోస్టెస్‌కు సోషల్ మీడియా సలాం!
సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ ఎయిర్ హోస్టెస్‌కు హ్యాట్సాఫ్ చెబుతోంది. ఆకలితో గుక్కపట్టిన ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్ హోస్టెస్. దీంతో మొన్నటిదాకా ఎవ్వరికీ తెలియని ఆమె పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ విషయాన్ని ఆమె ‘చాలా తృప్తి పడే పనిచేశాను.. సంతోషంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్ట్‌కు ఏకంగా 35 వేలకు పైగా షేర్లు, 8.1 వేల కామెంట్లు రావడం విశేషం. ఆ పోస్ట్ ఏంటంటే.. ‘ఫ్లైట్‌లో ఆకలితో ఉన్న ఓ పసిపాపకు నా పాలిచ్చాను. రోజువారి పనిలో భాగంగానే ఫ్లైట్‌లో నా పని నేను చేసుకుంటున్నాను. ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. ఇంతలో నాకు ఓ పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో నేను ఆ పసిపాప తల్లి వద్దకు వెళ్లాను. ఆ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నది. ఎందుకమ్మా, పాప ఏడుస్తున్నది.. ఆకలితో ఉన్నట్టుంది.. పాలు పట్టండి అన్నాను. పాపకు పట్టే ఫార్ములా పాలు అయిపోయాయని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఫ్లైట్‌లోని తోటి ప్రయాణీకులంతా ఏమైందని అడుగుతున్నారు. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. విమానంలో మామూలు పాలు తప్పా ఫార్ములా పాలు లేవు. ఆ పాప ఏడుపు, తోడుగా ఆ తల్లిని చూస్తే బాధేసింది. నాకు ఎక్కడో కదిలినట్టు అనిపించింది. నా బిడ్డ గుర్తకొచ్చింది. వెంటనే నా పాలు ఇచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చాలనుకున్నాను. ఆ పాపను నా ఒడిలోకి తీసుకొని పాలు పట్టాను. చాలా ఆకలితో ఉందేమో, పాప ఆతృతగా తాగింది. ఆ పాప ఏడుపు ఆపి, నిద్రపోయాక ఆ తల్లికి అప్పగించాను. ఆ తల్లి నాకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ క్షణాన ఆ బిడ్డ ఆకలి తీర్చే శక్తినిచ్చినందుకు ఆ దేవునికి ధన్యవాదాలు. ఇదేమీ గొప్పపని కాదు. కానీ తృప్తినిచ్చే పని. ఈ రోజు నా ఫ్లయింగ్ కెరీర్లోనే ఓ అద్భుతమైన రోజు.’ అని ఆ ఫొటోను షేర్ చేసింది. -
‘బిడ్డకు పాలివ్వడం కోసం.. ఇంత సొమ్ము వృధానా’
విల్లింగ్టన్ : దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా రికార్డుకెక్కిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘బ్రెస్ట్‌ఫీడింగ్ పేరు చెప్పి ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారంటూ’ న్యూజిలాండ్ పౌరులు ఆమెపై మండిపడుతున్నారు. విషయమేంటంటే.. రెండు నెలల క్రితం ఆర్డర్న్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా అందరిలానే సాధరణ మహిళ అయితే మెటర్నటి లీవ్ పెట్టి ఇంటి వద్దనే ఉంటూ తన చిన్నారి ఆలన పాలన చూసుకునేవారేమో. కానీ దేశాధ్యక్షురాలు కావడంతో కేవలం రెండు నెలలు మాత్రమే మెటర్నటి సెలవులు తీసుకుని, అనంతరం తన చిన్నారితో కలిసి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1 - 9 వరకూ నౌరులో జరగనున్న ‘పసిఫిక్ ఐస్‌ల్యాండ్స్ సమ్మిట్’కి ఆర్డర్న్ తన చిన్నారితో కలిసి హాజరయ్యారు. అయితే ఈ సమ్మిట్‌కి ఆర్డర్న్తో పాటు ఉప ప్రధాని విన్స్టన్ పీటర్స్ కూడా హాజరయ్యారు. ఒకే కార్యక్రమానికి హాజరవుతోన్న ప్రధాని, ఉప ప్రధాని మాత్రం రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించారు. ప్రయాణంలో తన బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుందని భావించి ఆర్డర్న్ ఇలా చేశారు. సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆర్డర్న్ తన బిడ్డకు పాలు ఇస్తూ ఉండి పోవడం వల్ల.. పీటర్స్ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకే సమావేశానికి హాజరవ్వడం కోసం ప్రధాని, ఉప ప్రధాని ఇలా రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 50,000(మన కరెన్సీలో దాదాపు 35 లక్షల రూపాయలు) డాలర్లు అదనపు భారం పడిందని హెరాల్డ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కివి ప్రజలు స్పందిస్తూ.. ‘ఇంత డబ్బు ఖర్చు చేసి మీరు ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అంత అవసరమా.. ఒక వేళ మీ డిప్యూటీ వెళ్తే సరిపోయేది అనుకుంటే అతన్నే పంపిస్తే అయిపోయేదిగా’ అంటూ ఆర్డర్న్‌ని విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు మద్దతు తెలిపే వారు మాత్రం.. ‘ఆర్డర్న్ తల్లిగా, దేశాధ్యక్షురాలిగా రెండు బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించించార’ని మెచ్చుకుంటున్నారు. ఈ విషయం గురించి ఆర్డర్న్‌ని వివరణ కోరగా.. ‘నేను ప్రత్యేక విమానంలో సమావేశానికి హాజరయినందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారు కదా.. ఒకవేళ నేను హాజరుకాకపోయినా ఇలానే విమర్శించేవారు. వీటన్నింటిని పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమ’ని తెలిపారు. -
‘అమ్మ’ సమయస్ఫూర్తికి సలామ్.. వైరల్
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు. ఆ బిడ్డ ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. ఆ సమయంలో మరో విషయం ఆలోచించకుండా మాతృమూర్తులు తన బిడ్డకు చనుపాలు ఇస్తారు. కానీ నేటికీ పలానా చోట ఉన్నప్పుడు పాలు ఇవ్వకూడదు, పలానా సమయంలో చనుపాలు అలా ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ మెక్సికన్ మదర్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పరిస్థితిని చాలా హుందాగా ఎదుర్కొన్నారంటూ ఆమెకు మద్దతు లభిస్తోంది. మెలానీ డడ్లీ అనే మహిళకు సంతానం నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఆమె మెక్సికోలోని కాబో శాన్లుకాస్లో రెస్టారెంట్‌కు ఇటీవల కుటుంబంతో పాటు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆమె బిడ్డ ఆకలితో ఏడుపు మొదలుపెట్టాడు. ఆ కన్నతల్లి వెంటనే తన బిడ్డకు పాలు ఇస్తూ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి కవర్ చేసుకోండి అని ఆమెకు సూచించాడు. దీంతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేయాలనుకున్న మెలానీ వెంటనే తన చీర కొంగుతో తల, ముఖం మొత్తం కప్పేసుకుని ఆ పాదచారికి బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను మెలానీ ఫ్యామిలీ ఫ్రెండ్ కారల్ లాక్వుడ్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు) ఆమె ఫ్యామిలీ నాకు సన్నిహితులే. కానీ నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. అయితేనేం ఆమె చేసిన పని ప్రశంసనీయం. మెలానీ చాలా మంచిపని చేశారు. ఆమె అనుమతిని కోరుతూ లాక్వుడ్ తన ఫేస్బుక్లో ఈ వివరాలను పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది. సమయస్ఫూర్తితో ఆమె తల, ముఖాన్ని కవర్ చేసుకుని తనకు సూచనలిచ్చిన వ్యక్తికి బదులిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెలానీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో.. తమ పిల్లలకు బహిరంగ స్థలాల్లో చనుపాలు ఇవ్వడం ఒకటని చెప్పారు. కుటుంబంతో పాటు ఉన్న తనకు శరీరాన్ని కవర్ చేసుకోవాలని ఓ వ్యక్తి సూచించడం విచిత్రంగా అనిపించిందన్నారు. అందుకే తెలివిగా నా ముఖాన్ని కవర్ చేసుకున్నానని వివరించారు. కాగా, ఇటీవల అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ మియామీలో ర్యాంప్ వాక్ చేస్తుండగా ఆమె ఐదు నెలల చిన్నారి ఏడుస్తున్నాడని.. బిడ్డకు పాలిస్తూనే ఈవెంట్లో పాల్గొని తల్లిప్రేమను మించింది మరొకటి లేదని నిరూపించారు. (మాతృత్వానికే అంబాసిడర్‌గా నిలిచిన మోడల్) -
బిడ్డకు పాలిస్తూ ర్యాంప్‌పై నడిచిన మోడల్
‘బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తన చిన్నారి ఆకలి తీర్చడమే అమ్మకు ప్రధానం. తల్లి ఎక్కడ ఉన్న, ఏం చేస్తున్న ఆమె ఆలోచనలన్ని తన బిడ్డ చూట్టే తిరుగుతుంటాయి. పిల్లలు ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. అంతే ఇంక ఆ సమయంలో ఏం ఆలోచించదు. వెంటనే బిడ్డ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం చనుబాలు. కానీ నేటికి మన సమాజంలో మహిళలు బహిరంగంగా బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. కారణం చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచించి. కేవలం ఈ కారణం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తల్లి అయిన తర్వాత కొన్నేళ్లపాటు ఉద్యోగాలు మానుకుంటున్నారు. ఈ విషయంలో విచక్షణ లేని పశుపక్ష్యాదులే మనిషి కంటే మేలు. బిడ్డ ఆకలి తీర్చడంలో వాటికున్న స్వతంత్రలో కనీసం ఒక్క శాతాన్ని కూడా సమాజం మన తల్లులకు ఇవ్వడంలేదు’. కానీ ఇప్పుడిప్పుడే మాతృమూర్తుల ఆలోచన ధోరణి మారుతుంది. ‘బిడ్డకు పాలు ఇవ్వడం నా ధర్మం. తల్లిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. దీనికి సమాజం గురించి పట్టించుకోనవసరం లేదు’ అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాక, భారత్ లాంటి సనాతన దేశాల్లో కూడా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. కొన్నాళ్ల క్రితమే ప్రముఖ కేరళ పత్రిక ‘మాతృభూమి’ తన గృహలక్ష్మి మ్యాగ్జైన్లో బిడ్డకు పాలు ఇస్తున్న మోడల్ ఫోటో ప్రచురించి ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మోడల్ బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేసి మాతృత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ స్లిమ్ షూట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మియామిలో నిర్వహించిన ఒక ర్యాంప్ షోలో పాల్గొంది. మోడల్ కంటే ముందు మార్టినా ఓ బిడ్డకు తల్లి. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. ర్యాంప్ వాక్ చేస్తుండగా మార్టినా ఐదు నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించింది. తల్లి కదా అందుకే బిడ్డ ఎందుకు ఏడుస్తోందో మార్టినాకు వెంటనే అర్ధమైంది. ర్యాంప్‌వాక్ నుంచి బయటకు వచ్చి తన చిన్నారి ఆకలి తీర్చాలనుకుంది. కానీ షో నిర్వాహకులు బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మార్టినా బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మార్టినా. మార్టినా షేర్ చేసిన ఈ ఫోటోకు అనూహ్యంగా.. పెద్ద ఎత్తున జనాలు మార్టినాకు అభినందనలు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం దీన్నో పబ్లిసిటి స్టంట్లా భావించి విమర్శలు చేస్తున్నారు. అయితే తనను విమర్శించే వారికి చాలా గట్టిగానే సమాధానం చెప్పారు మార్టినా. ‘నేను ఈ రోజు చేసిన పని కావాలని, నలుగురి దృష్టిలో పడాలని చేసింది కాదు. నేను గత ఐదు నెలలుగా చేస్తున్న పనినే ఇప్పుడు చేశాను. రోజు నా బిడ్డకు నేను ఇదే సమయంలో పాలు ఇస్తాను. ఈ రోజు కాస్తా ఆలస్యం అయ్యేసరికి తను ఏడుస్తుంది. తన ఆకలి తీర్చడం కంటే మరేది నాకు ముఖ్యం కాదు. ఈ విషయం కేవలం తల్లికి మాత్రమే అర్ధమవుతుంది. నన్ను విమర్శించే ముందు ఈ విషయం గురించి మీ అమ్మను అడగండి. వారికి తెలుసు నేను చేసింది కరెక్టో, కాదో’ అంటూ కాస్తా ఘాటుగానే స్పందించారు. ఇప్పటికైతే అమెరికాలో బిడ్డలకు తల్లులు బహిరంగంగా పాలు ఇవ్వొచ్చు, కానీ రెస్టారెంట్లు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో మాత్రం కవర్ చేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. అమెరికా మహిళలు ఈ ఆదేశాలను తప్పు పడుతున్నారు. ‘మేము కవర్ చేసుకోవడం కాదు మీరు మీ బుద్ధిని సరి చేసుకోండి’ అంటూ విమర్శిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ అమ్మకు సోషల్ మీడియా సలాం!
న్యూఢిల్లీ: అమ్మ ఎవరికైనా అమ్మే అంటారు. ఈ ఫొటో వెనుకున్న స్టోరీ గురించి తెలుసుకుంటే మీరు అదే అంటారు. ఈ చిత్రంలో జింకపిల్లకు పాలిస్తున్న అమ్మ రాజస్థాన్‌లోని బిష్ణోయ్ సామాజిక వర్గానికి మహిళ. ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మానవత్వానికి చిరునామాగా నిలిచిన ఈ మహిళ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ‘ఈ ఒక్క జింకపిల్లకే కాదు. తన జీవిత కాలంలో చాలా జింకపిల్లలకు చనుబాలిచ్చినట్టు ఆమె నాతో చెప్పారు. రాజస్థాన్ ఎడారుల్లో అనాథలుగా మిగిలిన, గాయపడిన ఎన్నో జింక పిల్లల ప్రాణాలు ఈవిధంగా కాపాడినట్టు వెల్లడించార’ని వికాస్ ఖన్నా వివరించారు. ప్రకృతిలోని చెట్లు, జంతువుల పట్ల బిష్ణోయ్ మహిళలు ఎంతో అనురక్తి కలిగివుంటారని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోను షేర్ చేసిన కొద్ది గంట్లోనే వేలాది లైకులు వచ్చాయి. బిష్ణోయ్ మహిళల పర్యావరణ ప్రియత్వాన్ని, సహృదయతను మెచ్చుకుంటూ కామెంట్లు వచ్చాయి. చిప్కో ఉద్యమంలో బిష్ణోయ్ మహిళలు ముందుండి పోరాడారని, కృష్ణ జింకలను తమ సొంత పిల్లల్లా సాకుతారని పలువురు ట్వీట్ చేశారు. మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఫొటోలోని మహిళకు సలాం చెబుతూ చాలా మంది పోస్టులు పెట్టారు. -
క్రేజీ డాడీ.. ఏం చేశాడో చూడండీ..!
ఫ్లోరిడాకు చెందిన క్రిస్ అల్లెన్ తండ్రి అనే పదానికి అర్థాన్ని చూపించాడు. పసిపాపలపై తల్లులు మాత్రమే కాదు, తండ్రి కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో ఉంటారని నిరూపించాడు. అసలు విషయం ఏంటంటే.. క్రిస్ అల్లెన్, జెన్నిఫర్ కాపో భార్యాభర్తలు. అయితే జెన్నిఫర్ ఉద్యోగం చేస్తోంది. కుటుంబాన్ని పోషించాలంటే ఎవరో ఒకరు జాబ్ చేయక తప్పని పరిస్థితి. వీరికి నెలల పాప ఉంది. భార్య జెన్నిఫర్ ఇంటి పట్టాన ఉండటం వీరి ఇంట్లో కుదరదు. అందుకే తన పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఎంత ప్రేమగా చూసుకున్నా, చిన్నారికి పాలివ్వాల్సి రావడం కాస్త సమస్యగా మారింది. దీనికి ఓ సొల్యూషన్ ఆలోచించాడు. పాపకు పాలిచ్చే సమయంలో అతడు టీషర్ట్ వేసుకుని దానికి పాల పీపా పట్టే అంతటి రంద్రాన్ని చేశాడు. తల్లులు పాలిస్తున్నట్లే తన పాపను ఒడిలో పెట్టుకుని, ఇంకా నిల్చున్నప్పుడు కూడా టీషర్ట్ లోపల పాలు నింపిన పీపాను పెట్టి చిన్నారికి పాలు ఇవ్వడం చేస్తున్నాడు. ఇక చిన్నారి ఏడవడం అనేది లేకుండా పాలిచ్చి, జోకొడుతూ పాపను తండ్రి క్రిస్ అల్లెన్ నిద్రపుచ్చుతుంటాడు. భార్య ఇంటికి వచ్చే వరకూ అలా చిన్నారి ఆలనాపాలనా బాధ్యతలు స్వీకరించాడు. -
పాలిచ్చిన తండ్రులు
హర్భిన్: చిన్న పిల్లల తండ్రులు 'మదర్స్ డే' సందర్బంగా తల్లిపాల ప్రాముఖ్యతను వినూత్నరీతిలో తెలిపారు. చైనాలోని హర్భిన్ సిటీలో పిల్లలున్న కొందరు పురుషులు ఒకే చోట చేరి బొమ్మలకు పాలు ఇచ్చారు. పురుషులు షర్టు విప్పి చేతిలో బొమ్మలను పట్టు కొని అచ్చం తల్లి పాలు ఇస్తున్నట్టు అనుకరించారు. 'మదర్స్ డే' సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తెలపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పని ఒత్తిడితో చైనాలోని పట్టణాల్లో తల్లి పాలు ఇచ్చేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా సగటున తల్లి పాలిస్తున్న వారు 40 శాతంగా ఉంటే.. 2014 అధికారిక నివేదిక ప్రకారం చైనాలోని పట్టణాల్లో 6 నెలలలోపు పిల్లలకు తల్లిపాలిస్తున్న వారు కేవలం 16 శాతం మాత్రమే ఉన్నారు. దీంతో తల్లి పాలతో పిల్లల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని తండ్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పాలు తాగే కదా ఇంతవాళ్లమయ్యాం!
నలుగురిలో ఉన్నప్పుడు స్త్రీ తన వ్యక్తిగత అవసరాలను, అత్యవసరాలను బలవంతంగా అదిమిపెట్టుకోగలిగినంత ‘శక్తిమంతురాలు’ అయితే కావచ్చు కానీ, పాలకోసం అలమటిస్తున్న బిడ్డ ఆకలి తీర్చే విషయంలో తల్లిగా పరిసరాలను పట్టించుకోనంత ‘బలహీనురాలు’ ఆమె. ఆ బలహీనతకు మరో పేరే తల్లి హృదయం. అయితే లండన్‌లోని అతి పెద్ద హోటళ్లలో ఒకటైన క్లారిట్డెజ్ హోటల్ యాజమాన్యం ఆ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయింది! లూయీ బర్న్స్ అనే ముప్పై ఐదేళ్ల మహిళ తన మూడు నెలల కూతురు ఇసాడోరాకు వరండాలో అందరిముందూ స్తన్యం పట్టడాన్ని తప్పు పట్టింది. ‘‘బిడ్డ తలపై నుంచి నేప్కిన్ కప్పి పాలివ్వొచ్చు కదా’’ అని సలహా కూడా ఇచ్చింది. గత సోమవారం తేనీటిని సేవించే మధ్యాహ్నపు విరామ సమయంలో ఒడిలోని పసికందు ఆపకుండా ఏడుస్తుండంతో పక్కన ఉన్నవారిని పట్టించుకోకుండా పాపకు పాలు పట్టింది. అదే లూయీ చేసిన పాపం! హోటల్ తీరుపై లూయీ ఎంతగానో నొచ్చుకున్నారు. ఈ విషయం మీడియా వరకు వెళ్లింది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఆ తల్లి చేసిన దానిలో తప్పేమీ లేదనీ, పైగా ఆది మహిళల హక్కు అని ప్రకటించడంతో ఇప్పుడక్కడ.. ‘బహిరంగ స్థలాలలో స్తన్యమివ్వడం సబబా కాదా’ అన్న చర్చ మొదలైంది. బిడ్డల తల్లులంతా లూయీ బర్న్స్‌ను సమర్థించారు. వారిలో పదిహేను మంది లూయీతో కలిసి వచ్చి, ఆమెను ఈసడించుకున్న క్లారిట్డెజ్ హోటల్ బయట తమ బిడ్డలకు బహిరంగంగా స్తన్యం పడుతూ నిరసన తెలిపారు. బ్యానర్లు ప్రదర్శించారు. ‘‘అవి ఉన్నది అందుకేరా స్టుపిడ్’’ అని ఒక బ్యానర్లో రాసి ఉంది. దీన్ని బట్టి తల్లుల మనసు ఎంత గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లోని సమానత్వ చట్టాల ప్రకారం... స్తన్యమిస్తున్న తల్లికి వ్యతిరేకంగా మాట్లాడ్డం కూడా లైంగిక వివక్ష కిందికే వస్తుంది. అయినా, ఇలాంటి విషయాలను చట్టం చెబితే తప్ప తెలుసుకోలేనంత అనాగరికంగా ఉన్నామా మనమింకా! పాలు తాగే కదా ఇంతవాళ్ల మయ్యాం.