ఐటీ ఎగుమతుల రెట్టింపు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఎగుమతులపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఐటీ శాఖ పనితీరును ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం హైదరాబాద్లోని టీఎస్ఐపీఏఆర్డీలో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 57 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఐటీ పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం కల్పించడంలో విజయవంతమయ్యామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ టెక్నాలజీ లీడర్ అయిందన్నారు. తెలంగాణను హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల కేంద్రంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.