TSPSC Exam Special
-
గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం (జులై 1) నిర్వహించే ఈ పరీక్షను రాసేందుకు లక్షలాది మంది విద్యార్థులు సన్నద్ధమై ఉన్నారు. ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశారు అధికారులు. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్ష అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇటీవల జారీ చేసిన కొన్ని కీలక సూచనల్ని పరిశీలిస్తే ► గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ►ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. ►మధ్యాహ్నం పేపర్-2 పరీలో 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు. ► ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ పేర్కొంది. చదవండి: లోకేశ్‌కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో? ►ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూ కూడా ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. ► అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ► ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదరు అభ్యర్ధిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ►ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. ► హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేసింది. -
ఉద్యోగ పరీక్షలపైనా కరోనా ప్రభావం
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావం ప్రవేశ పరీక్షలే కాదు ఉద్యోగ పరీక్షలపైనా పడింది. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన వివిధ ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వూ్యలను వాయిదా వేశాయి. టీఎస్పీఎస్సీ అయితే వివిధ శాఖలతో సంప్రదింపులను కూడా రద్దు చేసుకుంది. వాయిదా పడిన యూపీఎస్సీ పరీక్షలు ఈనెల 23 నుంచి మెుదలుకొని వచ్చే నెల చివరకు వివిధ విభాగాల్లో నిర్వహించాల్సిన సైంటిస్ట్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర 12 రకాల ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ వాయిదా వేసింది. వచ్చే నెల 3 వరకు నిర్వహించాల్సిన సివిల్స్ ఇంటర్వూ్యలను వాయిదా వేసింది. ఎస్ఎస్సీ వాయిదా వేసినవి ఎన్ఐఏ, సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ వ్యూన్ ఇన్ అస్సాం రైఫిల్స్‌లో ఈనెల 24 నుంచి వచ్చే నెల 30 వరకు నిర్వహించాల్సిన రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను (ఆర్ఎంఈ) స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. వాటితోపాటు సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్ వ్యూన్ పోస్టులకు ఈనెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు నిర్వ హించాల్సిన డీటేయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను (డీఎంఈ) వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్ఐ, సీఏపీఎఫ్, సీఐఎస్ఎఫ్లో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షలను వాయిదా వేసింది. వీటితోపాటు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (లెవల్–1) పరీక్షలను, అలాగే ఈనెల 30 నుంచి నిర్వహించాల్సిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వే యింగ్, కాంట్రాక్ట్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షలు.. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పలు పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల 27 నుంచి 30 వరకు ఆల్ ఇండియా సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ వారికి నిర్వహించాల్సిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ టెస్టు పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. మరోవైపు కరోనా అదుపులోకి వచ్చే వరకు ఎలాంటి పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించవద్దని నిర్ణయించింది. వివిధ శాఖలతో నిర్వహించాల్సిన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకుంది. వివిధ శాఖలతో ఈ–మెయిల్ ద్వారానే సంప్రదింపులు జరపాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రత్యేకం...
గ్రూప్స్ సందేహాలకు సాక్షి నిపుణుల సమాధానాలు తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగానే వేల ఉద్యోగాలు ప్రకటించింది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తోంది. వందల్లో పోస్టులు.. లక్షల్లో పోటీ! సర్కారు కొలువు కొట్టాలంటే.. అభ్యర్థులు తక్షణమే ప్రిపరేషన్ ప్రారంభించాలి. అయితే, కొత్త రాష్ట్రంలో సరికొత్త సిలబస్.. గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4, ఏఈఈ, ఏఈ, ఎస్ఐ/పోలీస్కానిస్టేబుల్.. ఇతర టీఎస్పీఎస్సీ పరీక్షల జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ సిలబస్ మొదలు.. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, ఉద్యమ చరిత్ర; తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ; ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్; సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ఆయా పేపర్ల వారీగా, సబ్జెక్టుల వారీగా, చాప్టర్ల వారీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి.! ఏ సబ్జెక్టుకు, ఏ చాప్టర్‌కు ఏఏ బుక్స్ చదవాలి?! చాప్టర్ల వారీగా ప్రామాణికమైన రిఫరెన్స్ బుక్స్ ఏంటి? నాణ్యమైన మెటీరియల్‌ను సేకరించుకోవడం ఎలా..పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది..!? ఇలా లక్షల మంది విద్యార్థులకు అనేక సందేహాలు..!! మీ సందేహాలను సబ్జెక్టు నిపుణలు, లేదా సిలబస్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి సాక్షి నివృత్తి చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా సాక్షి జిల్లా టాబ్లాయిడ్‌లోని ప్రతి రోజూ 4పేజీల విద్యలో టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రత్యేకం, ప్రతి గురువారం 8పేజీల భవితను ఫాలో అవుతూ మీ సందేహాలను మాకు పంపించడమే! మీ సందేహాలు sakshieducation@gmail.comMకు మెయిల్ చేయండి. మా చిరునామా: సాక్షి విద్య డెస్క్, కేరాఫ్ సాక్షి జర్నలిజం స్కూల్ 8-2-696, 697/75/1, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్, హైదరాబాద్-500008. టీఎస్పీఎస్సీ ఏఈఈ స్డటీ మెటీరియల్ - ఆన్లైన్ టెస్ట్స్ హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాజాగా విడుదల చేసిన 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షలు సెప్టెంబరు 20న జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 కేంద్రాల్లో వీటిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2 కి ఆన్లైన్ పరీక్షలు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ప్రశ్నకు వివరణతో నిపుణులు రూపొందించిన 3 గ్రాండ్ టెస్టులు కేవలం రూ.50కే అందిస్తోంది. వీటితో పాటు జనరల్ స్టడీస్ పేపర్లో ఉండే జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టులకు ఇంగ్లిష్‌లో మెటీరియల్ అందిస్తోంది. పోర్టల్‌లో ఏమున్నాయి? ఏఈఈ - పేపర్-2 సివిల్ ఇంజనీరింగ్ 3 టెస్టులు పేపర్-1 జనరల్ స్టడీస్ స్టడీ మెటీరియల్ http://onlinetests.sakshieducation.com/