tufan vehicle
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
నిజామాబాద్ క్రైం/బోధన్‌రూరల్ : ఆదిలాబాద్ జిల్లా ఖానా పూర్ మండలం పులిమడుగు పంచాయతీ పరిధిలోని అందోలి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన అన్నదమ్ములు హజీబాబు(52), సలీం ఖురేషీ(40) వారి బంధువు బోధన్ మండలం సాలూరకు చెందిన 2వ వార్డు సభ్యుడు ఖురేషి బాబు మీయా(58)లు తమ బంధువుల వివాహానికి సోమ వారం కుటుంబ సభ్యులతో కలిసి ఉట్నూర్ మండలం జంగాం గ్రామానికి తుఫాన్ వాహనంలో వెళ్లారు. వివాహ వేడుకల అనంతరం బుధవారం రాత్రి నిజామాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. అందోలి గ్రామం వద్దకు రాగానే రోడ్డుకు అడ్డంగా అడవి పంది రావడంతో దానిని తప్పించబోయి వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హజీబాబు, సలీం ఖురేషీ, ఖురేషి బాబు మీయాలు మృతి చెందారు. హజీబాబుకు భార్య ఇద్దరు కొడుకులు, సలీం ఖురేషీకు భార్య ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి మృతదేహాలకు ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలు గురువారం రాత్రి నిజామాబాద్‌కు చేరుకోగా, 9 గంటల ప్రాంతంలో మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. కురేషి బాబు మీయా మృతికి సాలూర సర్పంచ్ సున్నపు గంగామణి వీరయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, గ్రామస్తులు సంతాపం తెలిపారు. -
ట్రాక్టర్-తుఫాన్ వాహనం ఢీ; ముగ్గురి మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం రాజుపాలెం సమీపంలో శనివారం రాత్రి రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ట్రాక్టర్, తుపాన్ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సును ఢీ కొన్న తుఫాన్
మహబూబ్ నగర్: వేగంగా వెళ్తున్న తుఫాన్ వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గోసాపేట మండలం నర్సింగాయపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు..పెద్దకొత్తలో ఉన్న మైసమ్మను దర్శించుకొని వస్తున్న తుఫాన్ వాహనం నర్సింగాయపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో కొత్తకోట మండలానికి చెందిన ముగ్గురికి, వనపర్తి పట్టణానికి చెందిన ఒకరికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.