కారు ఢీకొని 15 గొర్రెలు మృతి
తుల్జారావుపేట(చివ్వెంల) : కారు ఢీకొని 15 గొర్రెలు మృతిచెందగా, ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈసంఘటన మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జి.తిర్మలగిరి ఆవాసం గుంపుల గ్రామానికి చెందిన మేకల వెంకన్న తన గొర్రెలను వ్యవసాయ వ్యవసాయం పొలం వద్దకు తీసుకెళ్లే క్రమంలో తుల్జారావుపేట గ్రామ స్టేజీ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో 15 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందగా, వెంకన్న కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా గొర్రెల విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.