సొరంగం పూర్తయితే జన్మధన్యం
కనగల్ (నల్లగొండ) : శ్రీశైలం సొరంగమార్గం పూర్తయితే జన్మధన్యమవుతుందని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తేలకంటిగూడెంలో రూ.16 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఒత్తిడి చేసి శ్రీశైలం సొరంగం నిర్మాణానికి రూ. 3 వేల కోట్లు మంజూరు చేయించినట్లు తెలి పారు. సొరంగం పూర్తయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.
గ్రావిటీ ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందుతుందన్నారు. రూ.7 వందల కోట్లతో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. తన నాలుగు పర్యాయాల ఎమ్మెల్యే పదవీకాలంలో సుమారు మొత్తంగా రూ. 4 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి మంజూరు చేయించడం మామూలు విషయం కాదన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తేలకంటిగూడెం నుంచి తిమ్మన్నగూడెం వరకు రూ. 1కోటి 20 లక్షలతో బీటీ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో వంద శాతం మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.
తేలకంటిగూడెం ఎంపీటీసీ కాంగ్రెస్‌లో చేరిక
సీపీఎం పార్టీకి చెందిన తేలకంటిగూడెం ఎంపీటీసీ బోగరి మణెమ్మరామకోటి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరా రు. ఎంపీటీసీకి పార్టీ కండువా కప్పి కాం గ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి పార్టీలో చేరిన ఎంపీటీసీకి ఆయన స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పా లన సాగుతుందన్నారు.
టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. పూటకో మాట చెప్పుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, వైఎస్ ఎంపీపీ భారతి వెంకటేశం, స్థానిక సర్పం చ్ బిల్లపాటి లక్ష్మమ్మ, ఎంపీటీసీ బోగరి మణెమ్మ, నాయకులు జి.భిక్షం యాదవ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బిల్లపాటి మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చిట్యాల : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ యువత కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. . కార్యక్రమంలో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మం డల అ«ధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, సర్పంచ్ కందిమళ్ల శశిపాల్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కందిమల్ల జైపాల్‌రెడ్డి, ఏర్పుల మైసయ్య, తొట్లపల్లి సురేష్‌గౌడ్, జడల ఆదిమల్లయ్య, రవి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.