కేవీబీపురం ఎంపీపీగా సులోచన
కేవీబీపురం : కేవీబీపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి, కళత్తూరు ఎంపీటీసీ సభ్యురాలు తుపాకుల సులోచన (ఎస్టీ) ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి సోడవరం రాజు ఎన్నికలు నిర్వహించా రు.
గతంలో ఇప్పటివరకు నాలుగు సార్లు ఎన్నికల కోసం సమావేశం నిర్వహించారు. కోరం లేదని రెండుసార్లు, మద్దతు లేదని రెండు సార్లు ఎన్నిక ను వాయిదా వేశారు. తాజాగా మంగళవారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు నందకుమార్, సులోచన మాత్రమే హాజరయ్యూరు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీపీ పదవికి అర్హతగల అభ్యర్థి తుపాకుల సులోచన ఒక్కరే ఉండడంతో ఆమెను ఎన్నుకోవాలని ఆదేశాలు అందించారు. దీంతో సులోచన ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఉత్తర్వులు అందజేశారు. చట్టపరంగా సులోచనను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపా రు. ఈ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎస్ఐ విశ్వనాథ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మోహన్‌రావు, చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, పుత్తూరు సీఐ చంద్రశేఖర్, పిచ్చాటూరు ఎస్ఐ పురుషోత్తంరెడ్డి, నారాయణవనం ఎస్ఐ శివకుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ సంగతి : కేవీబీ పురం ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అరుుంది. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలుండగా, పదింటిని టీడీపీై కెవశం చేసుకుంది. అరుుతే వారిలో ఒకరు కూడా ఎస్టీ మహిళ లేరు.
కష్టానికి ఫలితం దక్కింది
ఎన్నికల్లో పడిన కష్టానికి ఫలితం దక్కిం దని ఎంపీపీ తుపాకుల సులోచన చెప్పా రు. మంగళవారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ మూడు నెలలుగా ఎంతో ఉత్కంఠ రేపిన ఎంపీ పీ ఎన్నికలకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నానని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయడంతో అధికారులు న్యాయంగావ్యవహరించారని సులోచన చెప్పారు.
అధికార పార్టీ నాయకులు ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా జగనన్నపై ఉన్న అభిమానంతోనే పార్టీలో ఉన్నానన్నారు. తనను ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించిన కలత్తూరు గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నానని చెప్పారు.